Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సీఎస్కే జట్టులోకి బేబీ ఏబీ డివిలియర్స్?

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌‌లో పాయింట్ల పట్టికలో అట్టడడుగున ఉంది. 7 మ్యాచ్‌లు ఆడి 5 ఓడిపోయింది. సీఎస్కే కెప్టెన్ గా ఉన్న రుతురాజ్ గాయం కారణంగా నిష్క్రమించిన అనంతరం అతడి స్థానంలో 17ఏళ్ల ఆయుష్ మాద్రేను ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిలో సీఎస్కే జట్టులో ఒక విదేశీ ఆటగాడి స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో సీఎస్కే జట్టు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా వేలంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ను సీఎస్కే జట్టులోకి తీసుకుంటుందని సమాచారం. 21 ఏళ్ల డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స్ తరపున 10 మ్యాచ్‌లు ఆడాడు.

IPL 2025 Baby AB de Villiers to Join Chennai Super Kings

ఒక విదేశీ ఆటగాడు గాయపడ్డాడని చెప్పి జట్టులోకి చేర్చుకుంటారనే అనుమానం కూడా ఉంది. డెవాల్డ్ బ్రెవిస్ సీఎస్కేలో చేరితే జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు సీఎస్కే అభిమానులు సోషల్ మీడియా వేదిక బ్రెవిస్ కు స్వాగతం చెబుతున్నారు. అయితే డెవాల్డ్ బ్రెవిస్ నిజంగానే సీఎస్కేలో చేరుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే సీఎస్కే జట్టుకు ఇంకా 7 మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మార్పు అమలు చేస్తే డెవాల్డ్ బ్రెవిస్ జట్టులో చేరినా ఎటువంటి ప్రయోజనం ఉండదని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బేబీ ఏబీ డివిలియర్స్ గా పాపులరైన డెవాల్డ్ బ్రెవిస్ గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.

Story first published: Friday, April 18, 2025, 15:30 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+