ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్‌పాట్ కొట్టారు. రిషభ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు ఖర్చు పెట్టింది. శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు వెచ్చించింది. వెంకటేశ్ అయ్యర్‌కు పంట పండింది. తమ గూటికి తిరిగి తెచ్చుకోవాలని కేకేఆర్ రూ.23.75 కోట్లు కుమ్మరించింది.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి రోజు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రూ. 39.85 కోట్లు వెచ్చించి ఎనిమిది మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. అయితే తమ వద్ద మిగిలిన రూ.5.15 కోట్లతో 12 మంది ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. అందులో గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలి. సన్‌రైజర్స్ వద్ద ఒక్క ఆర్‌టీఎమ్ కార్డ్ ఉంది. దీంతో తమ మాజీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవచ్చు.

మహ్మద్ షమి (రూ. 10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ. 11.25 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. 3.20 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), అథర్వ (రూ.30 లక్షలు)లను దక్కించుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
బ్యాటర్లు: అభినవ్ మనోహర్, ట్రావిస్ హెడ్ (రిటైన్)
వికెట్ కీపర్లు : అథర్వ తైడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (రిటైన్)
ఆల్‌రౌండర్లు: అభిషేక్ శర్మ (స్పిన్-రిటైన్), నితీష్ కుమార్ రెడ్డి (పేస్-రిటైన్)
స్పిన్నర్లు : రాహుల్ చాహర్, ఆడమ్ జంపా
బౌలర్లు : సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, పాట్ కమిన్స్ (రిటైన్)
పెట్టిన ఖర్చు: రూ. 114.85 కోట్లు
మిగిలిన డబ్బు: రూ. 5.15 కోట్లు
ఆర్‌టీఎమ్: 01 (అన్‌క్యాప్డ్).