IPL 2025: గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సాధారణంగానే చాలా కోపంగా ఉంటాడు. కానీ ఐపీఎల్ సమయంలో తన జట్టు ఆటగాళ్లపై కోపాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఈ సారి కూడా అలాంటిదే జరిగింది. ఆదివారం సన్‍రైజర్స్ హైదరాబాద్ తో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ సందర్భంలో ఆశిష్ నెహ్రా చాలా కోపంతో కనిపించాడు. తన సొంత జట్టు ఆటగాడి తప్పు వల్ల అతనికి కోపం వచ్చింది. ఈ మ్యాచ్ లో సాయి కిషోర్ చేసిన చిన్న ఫీల్డింగ్ పొరపాటుపై గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పొరపాటు చేసిన సాయి కిషోర్
హైదరాబాద్ లోని ఉప్పల్ స్డేడియంలో జరిగిన మ్యాచ్ లో సాయికిషోర్ సులభమైన బంతిని ఆపడంలో పొరపాటు చేశాడు. దాని కారణంగా నెహ్రాకు కోపం వచ్చింది. సాయి కిషోర్ చేసి ఫీల్డింగ్ తప్పుకు గుజరాత్ టైటాన్స్ కోచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ నాలుగో ఓవర్ బౌలింగ్ వేశాడు. ఇషాంత్ శర్మ అభిషేక్ శర్మకు లెంగ్త్ బాల్ వేశాడు. అభిషేక్ బంతిని మిడ్-ఆన్ వైపు కొట్టాడు. సాయి కిషోర్ బంతిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. కానీ అతను క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించలేదు. సాయికిషోర్ బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపాలనుకున్నాడు. బంతి సాయికిషోర్ ముందు పడి అతనిని దాటి వెళ్లింది. అభిషేక్ కు నాలుగు పరుగులు ఇచ్చాడు. సాయికిషోర్ చేసిన ఈ తప్పును చూసి ఆశిష్ నెహ్రాకు కోపం వచ్చింది. ఆశిష్ నెహ్రా కోపంతో అరుస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అంతగా అరవడం ఎందుకు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గుజరాత్ అద్భుత విజయం
మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ తరఫున స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ 17వ ఓవర్లోనే సులభంగా గెలిచింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.