ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే మెగా ఆక్షన్ అనంతరం ఫ్రాంచైజీలన్నీ తమ బలాన్ని మరింత పెంచుకున్నాయి. తమ ప్రధాన ఆటగాళ్లు దూరమైనా,అంతే సమర్థులతో కొన్ని ఫ్రాంచైజీలు జట్టును తిరిగి నిర్మించుకున్నాయి.
అయితే ఓపెనింగ్ జోడీలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన, ఉప్పల్-ఢిల్లీ వంటి ఫ్లాట్ పిచ్‌లతో గత సీజన్‌లో పరుగుల వరద పారింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు విధ్వంసకర ఆటతో లీగ్‌కు సరికొత్త ఊపును తెచ్చారు. మరి, అదే జోరును వచ్చే సీజన్‌లో కొనసాగించడానికి ఏ జట్టు నుంచి ఎవరెవరు ఓపెనర్లుగా వస్తున్నారని ఫ్యాన్స్ విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీల ఓపెనర్లు జాబితా (అంచనా), వాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన ధర వివరాలు మీ కోసం..

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు) - క్వింటన్ డికాక్ (రూ. 3.60 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు) - ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్ (రూ. 18 కోట్లు) - సంజు శాంసన్ (రూ. 18 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) - ఫిలిప్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు) - విల్ జాక్స్ (రూ. 5.25 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (రూ. 18 కోట్లు)- డెవాన్ కాన్వే (రూ. 6.25 కోట్లు)
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ. 4 కోట్లు) - జోస్ ఇంగ్లిష్ (రూ. 2.60 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు) -జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (రూ. 9 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్: ఎయిడెన్ మార్క్‌రమ్ (రూ. 2 కోట్లు)- మిచెల్ మార్ష్ (రూ. 3.40 కోట్లు)
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (రూ. 16.5 కోట్లు) - జోస్ బట్లర్ (రూ. 15.75 కోట్లు).