Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అదృష్టం అంటే ఇదే.. BCCI గెంటేస్తే.. KKR ఆదుకుంది!

IPL 2025 KKR: టీమిండియా సహాయక కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ సహా పలువురిపై ఇటీవలే బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అభిషేక్ నాయర్ ను.. బాధ్యతలు చేపట్టిన 8 నెలలకే పదవి నుంచి తప్పించింది. అయితే బీసీసీఐ తొలిగించి రెండు రోజులు కూడా గడవలేదు.. అప్పుడే అభిషేక్ నాయర్ కు మరో కీలక పదవి దక్కింది. అదేంటంటే..

ఆహ్వానించిన కేకేఆర్..
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్‌ల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కారణంగా కోచింగ్ స్టాఫ్ లో పలువురిపై బీసీసీఐ వేటు వేసింది. అందులో అభిషేక్ నాయర్ కూడా ఒకడు. అయితే కోచింగ్ టీమ్ లోని కీలక వ్యక్తితో విభేదాలు రావడం వల్లే అతడు పదవి కోల్పోవాల్సి వచ్చిందని పలువురి వాదన. సరే విషయం ఏదైనా.. అతడికి ఆ పదవి పోయిన రెండు రోజుల్లో అదష్టం వెంటాడి, మరో కీలక పదవి వచ్చింది. అతడిని.. తమ జట్టులోకి ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ ఆహ్వానించింది.

IPL 2025 Abhishek Nayar Joins with KKR After Sacked By BCCI From Teamindia

ఏ పదవి అంటే..
తమ జట్టులో అసిస్టెంట్ కోచ్‌గా అవకాశం కల్పించింది కేకేఆర్. ఎందుకంటే ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన కేకేఆర్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో స్థాయిలో లేదు. ఎంతో పేలవంగా ఉంది. ఆడిన 7 మ్యాచుల్లో కేవలం మూడింటిలో మాత్రమే గెలిచింది. అయితే గత సీజన్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, కోచ్‌గా ఉన్న గంభీర్, సపోర్టంగ్ స్టాఫ్‌లో అభిషేక్ నాయర్ ఉన్నారు. కానీ ఈ సారి వీరంతా లేరు. శ్రేయస్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గంభీర్ బీసీసీఐ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో కేకేఆర్ కాస్త బలహీనపడింది. మరి ఇప్పుడు అభిషేక్ నాయర్ రాకతో కేకేఆర్ కు కాస్త బలం వచ్చినట్టైంది. చూడాలి మరి బీసీసీఐ గెంటేయగానే.. రమ్మన్న కేకేఆర్ కు అతడు ఎంతవరకు ఉపయోగపడతాడో..

Story first published: Saturday, April 19, 2025, 19:07 [IST]
Other articles published on Apr 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+