Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: రింకూపై వేటు.. కేకేఆర్ రిటైన్ చేసుకునేది ఆ నలుగురినే!

ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. బలమైన జట్లను మట్టికరిపించి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ముద్దాడింది. అయితే గత అయిదు సీజన్లలో కేకేఆర్ ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరింది. ఫైనల్‌కు చేరి కప్‌ను చేజార్చుకుని రన్నరప్‌గా మిగిలింది. మిగిలిన నాలుగు సీజన్లలో లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది.

గత సీజన్లలో చేసిన పొరపాట్లను 2024 సీజన్-వేలంలో సరిదిద్దుకుంది. మిచెల్ స్టార్క్ కోసం ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర రూ.24.75 కోట్లు వెచ్చించింది. అంతేగాక కెప్టెన్‌గా రెండు సార్లు కప్‌ను అందించిన గౌతమ్ గంభీర్‌ను తిరిగి తమ గూటికి తెచ్చుకుంది. మెంటార్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ వ్యూహాలు ఐపీఎల్-2024లో ఫలించాయి.

IPL 2025 4 Key Players Kolkata Knight Riders Likely to Retain ahead of Mega Auction

అయితే వచ్చే సీజన్ కోసం మెగావేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ అయినా పరిమిత సంఖ్యలో మాత్రమే ఆటగాళ్లను అట్టిపెట్టుకోగలదు. గత నిబంధనల ప్రకారం నలుగురు ఆటగాళ్లను ఉంచుకొని మిగిలిన అందరినీ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ నలుగురిలో ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు లేదా ముగ్గురు ఇండియన్ ప్లేయర్లు, ఓ విదేశీ క్రికెటర్‌ను తమ జట్టుతో ఉంచుకోవచ్చు. రైట్ టూ మ్యాచ్ (ఆర్‌టీఎమ్) కార్ద్ ద్వారా మరో ఆటగాడిని దక్కించుకోవచ్చు.

2022 మెగా వేలానికి ముందు కేకేఆర్ వెస్టిండీస్ సూపర్ స్టార్లు సునీల్ నరైన్, రసెల్‌ను, భారత యువ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, వెంటకేశ్ అయ్యర్‌లను రిటైన్ చేసుకుంది. కానీ ఈ సారి రిటైన్ ప్లేయర్లను ఎంచుకోవడం కేకేఆర్‌కు అంత తేలిక కాదు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను తప్పక ఫ్రాంచైజీతో ఉంచుకోవాలి. వెస్టిండీస్ హిట్టర్ల ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు.

మరో మూడేళ్లు తమ ఫిట్‌నెస్ కాపాడుకుంటూ నరైన్, రసెల్ సత్తాచాటగలరా అని ఫ్రాంచైజీని వెంటాడుతున్న ప్రశ్న. అయితే నరైన్, రసెల్ గేమ్ ఛేంజర్లు కావడంతో వారికి మరో అవకాశాం ఇవ్వాలని కేకేఆర్ భావిస్తోంది. ఇక మిగిలిన ఒక స్థానం కోసం వరుణ్ చక్రవర్తి లేదా వెంకటేశ్ అయ్యర్‌‌లలో ఒకరిని ఎంచుకోవాలని యోచిస్తోంది. ఆర్‌టీఎమ్‌కు అవకాశం ఉంటే ఇద్దరినీ తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ఆర్‌టీఎమ్ ద్వారా మిచెల్ స్టార్క్‌, రింకూ సింగ్‌పై కూడా కేకేఆర్ ఓ కన్నేసింది.

కేకేఆర్ రిటైన్డ్ లిస్ట్-2025:
శ్రేయస్ అయ్యర్, రసెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి

Story first published: Friday, May 31, 2024, 12:38 [IST]
Other articles published on May 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+