Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌పై కేవలం 2 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. అయితే ఆ జట్టు ఓడిపోయినప్పటికీ, ఆ టీమ్ యంగెస్ట్ ప్లేయర్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచులో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన అరంగేట్ర మ్యాచులోనే తొలి బంతికి సిక్స్ బాదిన అతడు.. మొత్తంగా 20 బంతుల్లో 34 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. అయితే మ్యాచ్ అనంతరం వైభవ్.. ఐపీఎల్ కోసం ఎలాంటి డైట్ పాటించాడు, ఎలా సన్నద్ధమయ్యాడో అతడి కోచ్ మనీష్ ఓజా వివరించారు.
మటన్ పిజా వదిలేశాడు.
వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ కోసం స్ట్రిక్ట్ డైట్ పాటించినట్లు తెలిపారు మనీష్. "అతడు మటన్ తినకూడదు అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాం. పిజ్జాను కూడా అతడి డైట్ చార్ట్ నుంచి తీసేశాం. కానీ అతడికేమో మటన్, చికెట్ అంటే చాలా ఇష్టం. పైగా చిన్నపిల్లవాడు కదా.. పిజ్జా అంటే అమితమైన ఇష్టం. కానీ ఇప్పడతడు తినట్లేదు. కానీ ఎప్పుడైన.. ఎంత మటన్ ఇచ్చినా పూర్తిగా తినేసేవాడు. అందుకే కాస్త బొద్దుగా కనిపిస్తాడు." అని కోచ్ వెల్లడించాడు.

ఆ ఇద్దరిని కలగిలిపితే వైభవ్..
"వైభవ్ ఫియర్ లెస్ బ్యాటర్. అతడు కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. రాబోయే మ్యాచుల్లో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడతాడు అని నేను నమ్ముతున్నాను. అతడిలో బ్రియాన్ లారా, యువరాజ్ సింగ్ లక్షణాలు ఉన్నాయి. వారిద్దరిని కలగలిపితే వైభవ్. " అని కోచ్ పేర్కొన్నాడు.
దేవుడిలా భావిస్తాడు..
లక్నో మ్యాచ్‌కు ముందు రోజు రాహుల్ ద్రవిడ్.. తనకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు వైభవ్. "వైభవ్ ఎంతో సంతోషంగా ఫోన్ చేశాడు. టీమ్ మేనేజ్ మెంట్ తనకు ఆడే అవకాశం ఇచ్చిందని చెప్పాడు. అప్పుడు అతడు కాస్త నెర్వస్‌గానే ఉన్నాడు. 'నేను, ప్రశాంతంగా ఆడు, ఎప్పుడూ ఎలా ఆడావో అలా ఆడు.' అని చెప్పాను అప్పుడతడు.. 'బంతి సిక్స్ బాదడానికి అనుకూలంగా ఉంటే సిక్సే బాదుతాను' అని చెప్పాడు." అని కోచ్ గుర్తుచేసుకున్నారు. "వైభవ్ చిన్నపిల్లవాడు. ఎంతో ఎమోషనల్. ఎప్పుడు ద్రవిడ్ సర్ ఎంత సపోర్ట్ ఇస్తారో చెబుతూ ఉంటాడు. ద్రవిడ్ ను దేవుడిలా భావిస్తాడు." అని కోచ్ అన్నాడు.
ఒత్తిడి పెంచి టార్గెట్ పెడతా..
"ప్రాక్టీస్ సెషన్ లో వైభవ్ కు ఒత్తిడి పరిస్థితులను సృష్టిస్తాను. టార్గెట్ పెడతాను. ఉదాహరణకు, 4 ఓవర్లలో 40 పరుగులు చేయాలి, లేదా 6 ఓవర్లలో 60 చేయాలి. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలనేది.. బౌలర్లను నియమించి సవాల్ విసురుతారను. అతడు లక్ష్యాన్ని ధైర్యంగా పూర్తిచేస్తాడు." అని కోచ్ చెప్పుకొచ్చారు.