IPL 2025: 18 సీజన్లు, 1133 మ్యాచ్‌లు , 13614 సిక్సర్లు.. బ్యాటర్ల విధ్వంసం మామూలుగా లేదు!
IPL 2025: టీ20 అంటేనే ఫాస్ట్ క్రికెట్ అంటే సిక్సర్లు, ఫోర్లతో కూడిన ఆట. కాలక్రమేణా ఈ ఫార్మాట్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతోంది. బ్యాటర్లు బౌలర్లపై తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఐపీఎల్ లో నిరంతరం పెరుగుతున్న సిక్సర్ల సంఖ్యే దానికి నిదర్శనం. ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. ఐపీఎల్ మొదటి సీజన్‌లో 622 సిక్సర్లు నమోదయ్యాయి. అంటే ఒక్కో మ్యాచ్ కు సగటున 10.72 సిక్సర్లను బ్యాటర్లు బాదేశారు. కానీ 2009 సీజన్ నుంచి సగటు సిక్సర్ల సంఖ్య 10 కంటే తక్కువకు తగ్గడం ప్రారంభమైంది. ఐపీఎల్ 2013 వరకు సగటు సిక్సర్ల సంఖ్య 10 కంటే తక్కువగానే ఉంది. కానీ 2014లో అది 11.90కి పెరిగింది. అప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌లో 10 కంటే ఎక్కవ సిక్సర్లు కొట్టబడుతున్నాయి.
ఇదంతా ఆ రూల్ వల్లే..
ఐపీఎల్ 2022లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చింది. దీని తర్వాత సిక్సర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదనపు ఆటగాడు ఉండటంతో జట్లు ఎక్కువ రిస్క్‌లు తీసుకోవడం ప్రారంభించాయి. 2022లో తొలిసారిగా లీగ్‌లో 1000 కంటే ఎక్కువ సిక్సర్లు నమోదయ్యాయి. మొదటిసారిగా ఒక మ్యాచ్‌కు సిక్సర్ల సంఖ్య 14.35గా నమోదైంది. 2023లో అది మొదటిసారిగా 15 దాటింది. ఆ సీజన్‌లో 74 మ్యాచ్‌ల్లో బ్యాటర్లు మొత్తం 1124 సిక్సర్లు బాదారు. ప్రతి 15.34 బంతులకు ఒక సిక్స్ కొట్టబడింది.

2024 సిక్సర్ల సీజన్
ఐపీఎల్ 2024లో బ్యాటింగ్ వేరే స్థాయికి చేరుకుంది. జట్లు 8 సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు 287 పరుగులు ఆ సీజన్‌లోనే నమోదైంది. ఆ సీజన్ లో ఓ జట్టు 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో బ్యాటర్లు మొత్తం 1260 సిక్సర్లు బాదారు. మ్యాచ్‌కు సగటున 17.02 సిక్సర్లు కొట్టారు. ఆ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 178 సిక్సర్లు కొట్టింది. 165 సిక్సర్లతో ఆర్సీబీ జాబితాలో రెండో స్థానంలో ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు 1133 మ్యాచ్‌లు జరగగా.. మొత్తం 13614 సిక్సర్లు బాదబడ్డాయి.
ఐపీఎల్ సీజన్ల వారీగా సిక్సర్ల రికార్డు ఇలా
2025 - 34*మ్యాచ్‌లు- 587*సిక్సులు
2024 -74 మ్యాచ్‌లు- 1260 సిక్సులు
2023 - 74 మ్యాచ్‌లు- 1124 సిక్సులు
2022 - 74- 1062
2018- 60- 872
2019- 60- 784
2020- 60- 734
2012- 75- 731
2014- 60- 714
2017- 59- 705
2015- 59- 692
2021- 60- 687
2013- 76- 672
2011- 73- 639
2016- 60- 638
2008- 58- 622
2010- 60- 585
2009- 57- 506
ఈ సీజన్ లో రికార్డు నమోదు కానుంది..
2024 సీజన్ లాగా ఐపీఎల్ 2025లో 250+ స్కోర్లు కనిపించకపోయినా సిక్సర్ల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఏప్రిల్ 18 వరకు 34 మ్యాచ్ లు జరిగాయి. ఈ కాలంలో బ్యాటర్లు 587 సిక్సర్లు కొట్టారు. అంతే ప్రతి మ్యాచ్ లో సగటున 17.2 సిక్సర్లు కొట్టబడ్డాయి. ఇది ఐపీఎల్ లోని అన్ని సీజన్ల కంటే ఎక్కువ. ఇంకా 40 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. 2024 కంటే ఐపీఎల్ 2025లో ఎక్కువ సిక్సర్లు కొట్టబడుతాయని అంచనా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications