IPL 2025 Playoffs: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కొన్ని జట్లు అంచనాలను మించి రాణిస్తుండగా.. మరికొన్ని టీమ్స్ దారుణంగా విఫలమవుతున్నాయి. గత ఎడిషన్‌లో రఫ్ ఆడించిన జట్లు ఈసారి కుదేలవుతుండగా.. అప్పటివరకు తక్కువగా అంచనా వేసిన మరికొన్ని జట్లు మాత్రం ఉత్సాహంతో ముందుకు పరిగెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. ఓడలు బండ్లు - బండ్లు ఓడలు అవుతాయ్ అన్న సామెత గుర్తుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన 25 మ్యాచుల ప్రదర్శన, ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు ఏ జట్టుకు ఎంత అవకాశం ఉందో తెలుసుకుందాం..
టాప్‌లో ఉన్న జట్టు ఇదే..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో.. గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచింది. CricTracker అనే క్రీడా వెబ్ సైట్ అంచనా ప్రకారం.. ప్లే ఆఫ్స్ రేసులోకి వెళ్లడానికి గుజరాత్ టైటాన్స్ కు 74 శాతం అవకాశాలు ఉన్నాయి.రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు 75% ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. ఇక మూడో స్థానంలో ఉన్న కేకేఆర్ ఆరు మ్యాచులు ఆడి.. మూడింటిలో గెలిచింది. ఈ జట్టుకు 55% శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఆర్సీబీ ఛాన్స్ ఎంతంటే?
నాలుగో స్థానంలో ఉన్న ఆర్సబీకి (మూడు విజయాలు, రెండు ఓటములు) 50 శాతం, ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ కు (మూడు మ్యాచులు, ఒక ఓటమి) 52 శాతం ఛాన్సెస్ ఉన్నాయి. ఆరో స్థానంలో ఉన్న లక్నో (3 విజయాలు, రెండు ఓటములు) జట్టుకు 47 శాతం, ఏడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు(2 విజయాలు, 3 ఓటములు) 26 శాతం ఉంది.
నాలుగు ఓటములు, ఒక్క విజయంతో ఉన్న ముంబయి ఇండియన్స్ కు 11 శాతం , ఐదు ఓటములు, ఒక్క విజయంతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు 6 శాతం, సన్ రైజర్స్ హైదరాబాద్ (4 ఓటములు, 1 విజయం) జట్టుకు 4 శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.