Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: SRH తీసుకున్న చెత్త నిర్ణయమది- ఆకాశ్ చోప్రా

ఐపీఎల్-2024 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సారథి బాధ్యతలు ఎస్‌ఆర్‌హెచ్ అప్పగించింది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్ జట్టును కమిన్స్ నడిపించనున్నాడు. వేలంలో కమిన్స్‌ కోసం రూ.20.50 కోట్లు సన్‌రైజర్స్ వెచ్చించింది.

అయితే కెప్టెన్సీ విషయంలో సన్‌రైజర్స్ తీసుకున్న నిర్ణయం పేలవమైనదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. తుదిజట్టులో ఉంటాడో లేడో అని చెప్పలేని ప్లేయర్‌ను కెప్టెన్‌గా నియమించారని చోప్రా విమర్శించాడు. కమిన్స్ ఐపీఎల్ గణాంకాలను పరిశీలించి కెప్టెన్‌గా ఎంపికచేశారా? అని ప్రశ్నించాడు.

IPL 2024 Worst decision taken by Sunrisers Hyderabad- Aakash Chopra

''ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించారు. అసలు అతని ఐపీఎల్ గణాంకాలు గమనించారా? ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అతడు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతేగాక బ్యాటుతోనూ మెరవలేకపోయాడు. జట్టులో ఆడేది నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే. కమిన్స్ కనీసం పవర్‌ప్లేలో, డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేయలేడు''

''మీరు నిర్దేశించిన బాధ్యతలు కమిన్స్ నిర్వర్తించలేకపోతే పరిస్థితేంటి? విదేశీ ప్లేయర్లపై ఖర్చు చేయాల్సిన మొత్తంలో 25శాతం అతనొక్కడి కోసమే వెచ్చించారు. అది కూడా తుదిజట్టులో ఉంటాడని స్పష్టంగా చెప్పలేని ఆటగాడి కోసం ఖర్చుపెట్టారు. 11 మంది ఆస్ట్రేలియన్లు ఆడే జట్టుకు అతను కెప్టెన్. వన్డే వరల్డ్ కప్‌ను సాధించాడు. కానీ టీ20ల్లో అతను సత్తాచాటలేదు'' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

గతేడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్‌లను గెలిచిన కెప్టెన్‌గా కమిన్స్ నిలిచాడు. ఆ రెండు ఫైనల్లోనూ భారత్‌పైనే ఆస్ట్రేలియా విజయం సాధించడం గమనార్హం. అంతేగాక కెప్టెన్‌గా యాషెస్ సిరీస్‌ను కాపాడుకున్నాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023గా, ఐసీసీ టెస్టు జట్టు సారథిగా కమిన్స్ ఎంపికయ్యాడు.

అయితే గత మూడు సీజన్లలో కమిన్స్ 12 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరఫునన లీగ్‌లో అడుగుపెట్టాడు.2017లో ఢిల్లీ ఫ్రాంచైజీకి ఆడాడు. మధ్యలో కొన్నేళ్ల పాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. 2020 ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికాడు. రూ.15.50 కోట్లకు కోల్‌కతా అతన్ని తిరిగి దక్కించుకుంది. కానీ వన్డే వరల్డ్ కప్ కోసం గత ఐపీఎల్ సీజన్ ఆడలేదు. ఐపీఎల్‌లో ఓ జట్టుకు కమిన్స్‌ నాయకత్వ బాధ్యతలు అందుకోవడం ఇదే మొదటిసారి.

Story first published: Tuesday, March 5, 2024, 16:06 [IST]
Other articles published on Mar 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+