Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mayank Yadav:ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెండ్‌గా ఉన్నావ్!- మాజీ క్రికెటర్లు

ఐపీఎల్ 17వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 199 పరుగులు చేసింది. డికాక్ (54; 38 బంతుల్లో), కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో), నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో) సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.శిఖర్ ధావన్ (70; 50 బంతుల్లో), జానీ బెయిర్‌స్టో (42; 29 బంతుల్లో) పోరాడారు. అయితే పంజాబ్ ఓ దశలో గెలుపు దిశగా సాగింది. తొలి వికెట్‌కు ధావన్, బెయిర్‌స్టో 11.4 ఓవర్లలో 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ 21 ఏళ్ల LSG ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు. నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

IPL 2024 Where have you been hiding- Former cricketers praise on pace sensation Mayank Yadav

అంతేగాక ఐపీఎల్ 2024లో మయాంక్ యాదవ్ అత్యంత వేగవంతమైన బాల్ వేశాడు. మయాంక్ సంధించిన ఓ బంతి గంటకు 155.8 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. వేగంతో పాటు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేయడంతో అందరి చూపు మయాంక్ యాదవ్ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు మయాంక్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. బ్రెట్ లీ, డేల్ స్టెయిన్, కెవిన్ పీటర్సన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ ఈ యువ పేస్ సంచలనాన్ని కొనియాడుతూ ట్వీట్‌లు చేశారు.

భారత్ మరో ఫాస్ట్ బౌలర్‌ను కనుగొంది. మయాంక్ యాదవ్..అద్భుతమైన వేగం, ఆకట్టుకునే ప్రదర్శన - బ్రెట్ లీ155.8 కి.మీ/గంట.. మయాంక్ యాదవ్ ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావు? - డేల్ స్టెయిన్
మయాంక్ యాదవ్ 155 కి.మీ/గంట వేగంతో బౌలింగ్ చేశాడు. మయాంక్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ బౌలర్- కెవిన్ పీటర్సన్ మయాక్ యాదవ్..ఇంత టాలెంట్‌గా ఉన్నావేంట్రా. అతని బౌలింగ్ చూడటం సంతోషంగా ఉంది. అతిత్వరలో అతడు టీమిండియా తరఫున ఆడాలని కోరుకుంటున్నా - హర్భజన్ సింగ్
మయాంక్ యాదవ్‌కు గొప్ప పేస్ నైపుణ్యం ఉంది. అతడిని లక్నో చక్కగా ఎంపిక చేసుకుంది- ఇర్ఫాన్ పఠాన్

Story first published: Sunday, March 31, 2024, 10:55 [IST]
Other articles published on Mar 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+