For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: మినీ వేలానికి ముందు చెత్త నిర్ణయం.. ఆర్సీబీ కొంపమునిగినట్లేనా?

Royal Challengers Bangalore: ఐపీఎల్ మినీ వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ నుంచి ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ట్రేడింగ్ ద్వారా తీసుకుంది. ఈ నిర్ణయం మంచిది కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనికి కారణం ఏంటంటే?

గ్రీన్ స్థానం ఏంటి?:ముంబైకు ఆడినప్పుడు ఓపెనర్‌గా వచ్చిన గ్రీన్ బ్యాటుతో ఆకట్టుకున్నాడు. ఫీల్డింగ్ నిబంధనలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో అతను దిట్ట. అయితే ఆర్సీబీకి డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా మంచి ఓపెనింగ్‌లు అందిస్తున్నారు.

IPL 2024 Trading in Cameron Green is not good for RCB

రజత్ పటీదార్, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ మూడు, నాలుగు స్థానాల్లో వస్తారు. అప్పుడు గ్రీన్‌ను ఐదో స్థానంలో పంపాలి. ఈ స్థానంలో గ్రీన్ రాణించడం కష్టమనే చెప్పాలి. లేదు, గ్రీన్‌తో ఓపెనింగ్ చేయిస్తే.. మిగతా బ్యాటర్లు అందరూ ఒక స్థానం కిందకు దిగాల్సి వస్తుంది. ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది.

వేలానికి ఇబ్బంది..:గ్రీన్‌ను తీసుకోవడానికి ముందు ఆర్సీబీ వద్ద రూ.40.75 కోట్ల పర్సు ఉంది. దీంతో మినీ వేలంలో కీలకమైన ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఆ జట్టుకు ఉంది. కానీ ఇప్పుడు భారీ ధరకు గ్రీన్‌ను తీసుకోవడంతో వాళ్ల పర్సు విలువ రూ.23.25 కోట్లకు పడిపోయింది.

ఈ మొత్తంతో సరైన బౌలింగ్ విభాగాన్ని నిర్మించుకోవడం ఆ జట్టుకు పెద్ద తలనొప్పి అని చెప్పాలి. సిరాజ్ మినహా ఆ జట్టులో ప్రపంచ స్థాయి బౌలర్ లేడు. రీస్ టాప్లేకు గాయాల బెడద ఎక్కువ. దీంతో ఆర్సీబీ బౌలింగ్‌కు కూడా గ్రీన్‌ను తీసుకోవడం సమస్యగానే మారింది.

ఆసీస్ ఫోకస్..:మంచి సత్తా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు దొరకడం ఏ జట్టుకైనా కష్టమే. అదే మంచి ట్యాలెంట్ ఉన్న అలాంటి ప్లేయర్‌ దొరికితే ఏ దేశం కూడా వాళ్లను అంత ఈజీగా వదలదు. గ్రీన్‌ది కూడా అదే పరిస్థితి. ఆసీస్‌కు దక్కిన జనరేషనల్ ట్యాలెంట్‌ గ్రీన్ అని చాలా మంది చెప్తారు.

అలాంటి వాడికి గాయాల బెడద కూడా ఎక్కువే. అందుకే అతను ఏమాత్రం ఫిట్‌నెస్ కోల్పోయినా.. ఆసీస్ క్రికెట్ బోర్డు మధ్యలో దూరి అతన్ని తమ వెంట తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది. అది కూడా టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో అతన్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటుంది. దీంతో అతన్ని ఆర్సీబీ చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. దీని కన్నా అతన్ని తీసుకోకపోవడమే మంచిది.

Story first published: Monday, November 27, 2023, 19:54 [IST]
Other articles published on Nov 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+