Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్‌కు ఇదే చివరి సీజన్- ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు (Video)

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌కు ఇదే చివరి సీజన్ అని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ గ్రూప్ మొత్తం ఇదే ఆలోచనతో ఉందని బౌచర్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

దాదాపు నెల రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మార్క్ బౌచర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇది వివాదాస్పదంగా మారడంతో ఈ ఇంటర్వ్యూను సోషల్ మీడియా నుంచి తొలగించారు. కానీ ఓ నెటిజన్ దాన్ని సేవ్ చేసుకుని తన ఖాతా నుంచి తాజాగా అప్‌లోడ్ చేశాడు. రోహిత్-హార్దిక్ వివాదం ముదురుతున్నఈ సమయంలో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.

IPL 2024 This is Rohit s last season - Mumbai coach Mark Boucher sensational comments Video goes viral

మార్క్ బౌచర్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూకి రోహిత్ భార్య రితికా సజ్‌దేహ్ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రోహిత్‌ను తప్పించడం క్రికెటింగ్ విషయమని, భావోద్వేగంతో ఆలోచించవద్దని మార్క్ అన్నాడు. దీనికి రితికా 'ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి' అంటూ కామెంట్ చేశారు.

మరోవైపు రోహిత్‌కు ఇదే చివరి సీజన్ అంటూ మార్క్ బౌచర్ చేసిన వ్యాఖ్యలతో ముంబై ఇండియన్స్ గ్రూప్‌లో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ అభిమానులు ముంబై ఫ్రాంచైజీపై మండిపడుతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో హార్దిక్ పాండ్యకు ఎదురైన చేదు అనుభవాన్ని మరవకముందే ఈ వీడియో మరోసారి లీక్ కావడం ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పిగా మారింది.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో హార్దిక్‌ను హేళన చేస్తూ రోహిత్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. హార్దిక్‌ టాస్‌కు వచ్చినప్పుడు, బౌలింగ్, బ్యాటింగ్ చేసినప్పుడు రోహిత్ నినాదాలతో స్టేడియం మార్మోగింది. అంతేగాక జట్టులో సఖ్యత లేదని ఈ మ్యాచ్‌‌లో కనపడింది. హార్దిక్ నాయకత్వ ఆలోచనలను రోహిత్‌‌తో పాటు బుమ్రా వ్యతిరేకించడం మైదానంలో స్పష్టంగా కనిపించింది.

అయితే హార్దిక్‌‌కు ముంబై ఇండియన్స్ అభిమానుల మద్దతు దక్కేలా ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాలో హార్దిక్ కంటే రోహిత్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రోహిత్‌కు అపారమైన గౌరవం ఇస్తున్నట్లు ప్రేక్షకుల్లో భావన కలిగించేలా హిట్ మ్యాన్‌కు సంబంధించిన పోస్ట్‌లను ఎక్కువగా అప్‌లోడ్ చేస్తోంది. ఈ సమయంలో మార్క్ బౌచర్ ఇంటర్వ్యూ క్లిప్ బయటకు రావడం ముంబై యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. కాగా, ఉప్పల్ వేదికగా రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

Story first published: Tuesday, March 26, 2024, 15:14 [IST]
Other articles published on Mar 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+