Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ దశను మార్చేసిన ఆ రూల్పై క్లారిటీ ఇచ్చిన జై షా

BCCI secretary Jay Shah: ఐపీఎల్ 2024లో కొత్తగా మనం చూస్తోన్న రూల్- ఇంపాక్ట్ ప్లేయర్. మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు జట్టు అవసరాలకు అనుగుణంగా ప్లేయర్‌ను స్వాప్ చేయడానికి వీలు కల్పించే రూల్ ఇది. ఐపీఎల్ దశను మార్చేసింది. దీని ఇంప్లిమెంట్‌పై హాట్ డిబేట్ సాగుతోంది.

నెక్స్ట్ వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలులోకి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఒక్కసారి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇది ఇంప్లిమెంట్ కావడం అంటూ జరిగితే అన్ని ఫార్మట్లలో కూడా బౌలర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే వాదనలు కూడా లేకపోలేదు

IPL 2024 The Impact Player rule is not permanent its a test case says Jay Shah

దీనిపై తొలిసారిగా స్పందించాడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి జై షా. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పర్మనెంట్ కాదని తేల్చి చెప్పారు. ఐపీఎల్ తదుపరి ఎడిషన్లల్లో దీన్ని ఉపయోగించాలా? వద్దా? అనే విషయంపై స్టేక్ హోల్డర్లతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

టీ220 వరల్డ్ కప్ 2024లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేయడంపై ఇంకా చర్చించలేదని జై షా వివరించారు. ఈ ప్రస్తుతానికి ఓ టెస్ట్ కేస్ అని అభివర్ణించారు. ఈ రూల్ వల్ల ఐపీఎల్‌లో ప్రతి గేమ్‌లో కూడా ఇద్దరు భారత ఆటగాళ్లకు ఆడే అవకాశం లభించిందని గుర్తు చేశారు.

దీని అమలుపై ప్లేయర్లు, ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్‌లతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ఈ రూల్ శాశ్వతం కానప్పటికీ.. మున్ముందు అమలు కాబోదని గ్యారంటీ ఇవ్వలేమని జై షా చెప్పారు. మ్యాచ్‌పై ఈ రూల్ నిజంగానే ఇంపాక్ట్ చూపిస్తోందని, గేమ్‌ను మరింత ఆసక్తిగా మారుస్తుందో? లేదో? మనం చూస్తోన్నామని వ్యాఖ్యానించారు.

ఈ రూల్- సరైనది కాదని ఏ ప్లేయర్ అయినా భావిస్తే, వాళ్లతో తాము మాట్లాడుతామని ఇప్పటివరకు ఇలాంటి కంప్లైంట్లు తమకు అందలేదని జై షా వివరించారు. దీన్ని అంతర్జాతీయ క్రికెట్‌కు వర్తింపజేయడంపై టీ 20 ప్రపంచ కప్ 2024 తరువాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Story first published: Friday, May 10, 2024, 14:33 [IST]
Other articles published on May 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+