Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్ .. కోచ్ కూడా మార్పు!

ఐపీఎల్ సందడి మొదలైంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌కు ఫ్రాంచైజీలు తమ ఏర్పాట్లు మొదలుపెట్టాయి. అందరికంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ శిబిరాన్ని షురూ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ ఎల్లో జెర్సీ ధరించి చెమటలు కూడా చిందిస్తున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. ప్యాట్ కమిన్స్‌ను సారథి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో అధికారికంగా సన్‌రైజర్స్ ఈ విషయాన్ని వెల్లడించనుంది. ఎయిడెన్ మార్క్‌రమ్ స్థానంలో కమిన్స్ జట్టును నడిపించనున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీ సమర్థవంతగా నిర్వర్తించే సత్తా ఉండటంతో కమిన్స్ కోసం సన్‌రైజర్స్ రూ.20.50 కోట్లు కుమ్మరించింది.

IPL 2024 Sunrisers Hyderabad will appoint a new captain The coach will also change

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను మార్క్‌రమ్ గొప్పగా నడిపించినప్పటికీ ఐపీఎల్‌లో సత్తాచాటలేకపోతున్నాడు. గత సీజన్‌లో హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. మరోవైపు 17వ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ఎదురుదెబ్బ తగిలింది. బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ ఈ సీజన్‌ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీతో స్టెయిన్ ఇప్పటికే వెల్లడించాడని సమాచారం. స్టెయిన్ 2022 నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

దీంతో కొత్త కెప్టెన్‌తో పాటు కొత్త బౌలింగ్ కోచ్‌ను మరికొన్ని రోజుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నియమించనుంది. బౌలింగ్ కోచ్‌ను వెతికే పనిలో ఫ్రాంచైజీ నిమగ్నమై ఉంది. అయితే లీగ్ ప్రారంభమయ్యే సమయానికి కొత్త బౌలింగ్ కోచ్ దొరకకపోతే ప్రధాన కోచ్ డేనియల్ వెటోరీపై అధిక పనిభారం పడుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ట్రేడ్), అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్‌విర్‌సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్‌ సుబ్రమణ్యన్‌.

Story first published: Saturday, March 2, 2024, 17:44 [IST]
Other articles published on Mar 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+