Sunrisers Hyderabad: అతన్ని వదులుకోవడం.. సన్‌రైజర్స్‌కు దెబ్బ కొట్టడం ఖాయం!
IPL 2024: ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఏకంగా రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం వదిలేసింది. ఇలా అతన్ని రిలీజ్ చేయడం సరైన నిర్ణయం కాదని సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు.
ఇలా అతన్ని వదులుకోవడం ఆ తర్వాత సన్‌రైజర్స్‌కే దెబ్బ కొడుతుందని మూడీ చెప్పాడు. వేలంలో బ్రూక్‌ను అంత భారీ ధర చెల్లించకుండానే తిరిగి పొందాలని సన్‌రైజర్స్ అనుకొని ఉండొచ్చని, కానీ మిగతా ఫ్రాంచైజీలు కూడా బ్రూక్ కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతాయని మూడీ వివరించాడు.

'బ్రూక్‌ను ఈసారి సగం ధరకే కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ అతన్ని ఇలా వదిలేయడాన్ని సన్‌రైజర్స్‌కు ఆ తర్వాత చాలా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రూక్ చాలా ట్యాలెంటెడ్. అన్ని జట్లూ అతని కోసం గట్టిగానే ప్రయత్నిస్తాయి' అని మూడీ చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో బ్రూక్ పరమ చెత్త ప్రదర్శన చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఒక్క సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో ఏమాత్రం రాణించలేదు. 'ఈ విషయంలో మనం గమనించాల్సిన మరో విషయం.. బ్రూక్ ఆడిన తొలి సీజన్. అతను ఆడిన 80 శాతం మ్యాచుల్లో తన సహజసిద్ధమైన స్థానంలో ఆడలేదు' అని గుర్తుచేశాడు.
'బ్రూక్ సాధారణంగా మిడిలార్డర్‌లో నాలుగో నెంబర్‌లో ఆడే ప్లేయర్. అతన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం ఓపెనర్‌గా పంపింది. టీ20 ఫార్మాట్‌లో అతను అప్పటి వరకు ఒక్కసారి కూడా ఓపెనింగ్ చేయలేదు. అతని పేలవ ప్రదర్శనకు అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఈ విషయంలో ఆ ఫ్రాంచైజీది కూడా తప్పే అని చెప్పొచ్చు' అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications