Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లెజెండర్ల సరసన నితీష్ కుమార్ రెడ్డి

SRH vs RR: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్‌ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాట్‌తో, అనంతరం బంతితో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. బలమైన రాజస్థాన్ రాయల్స్‌ను చిట్టచివరి బంతిలో

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి చెలరేగాడీ మ్యాచ్‌లో. 42 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్- 42, ఓపెనర్ ట్రావిస్ హెడ్- 58 పరుగులతో మెరుపులు మెరిపించారు.

IPL 2024 SRH vs RR Nitish Kumar Reddy equals 8 sixes record as Klaasen David Warner

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ధీటుగా ఆడింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడినప్పటికీ ఆ తరువాత కుదురుకుంది. దాదాపుగా గెలిచింత పని చేసింది. ఒకదశలో 201 పరుగుల భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించేలా కనిపించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్- 67, టాప్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్- 77 పరుగులతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు గానీ.. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలం అయ్యారు.

మిడిల్ ఓవర్లల్లో ఒత్తిడికి లోనైంది రాజస్థాన్ రాయల్స్. వరుసగా వికెట్లను కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయ్యాక రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయిర్, ధృవ్ జురెల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో పావెల్ అవుట్ కావడంతో 200 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్‌కు తెర పడింది.

IPL 2024 SRH vs RR Nitish Kumar Reddy equals 8 sixes record as Klaasen David Warner

ఈ మ్యాచ్‌‌లో నితీష్ కుమార్ రెడ్డి ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టిన ఘనతను సాధించాడు. ఇదివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ 2017లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై ఎనిమిది సిక్సులు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో అతను 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

2020లో రాజస్థాన్ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో మనీష్ పాండే, ఇదే సీజన్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై హెన్రిచ్ క్లాసెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ట్రావిస్ హెడ్.. ఒకే మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లు చొప్పున కొట్టారు. తాజాగా ఈ మ్యాచ్‌లో ఎనిమిది సిక్సర్లతో వారి సరనస నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి.

Story first published: Friday, May 3, 2024, 11:17 [IST]
Other articles published on May 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+