For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎస్ఆర్‌హెచ్ గెలిచిన ఆనందంలో కావ్యా పాప ఏం చేసిందంటే..?!

SRH vs RR: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్‌ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాట్‌తో, అనంతరం బంతితో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. బలమైన రాజస్థాన్ రాయల్స్‌ను చిట్టచివరి బంతిలో

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి చెలరేగాడీ మ్యాచ్‌లో. 42 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్- 42, ఓపెనర్ ట్రావిస్ హెడ్- 58 పరుగులతో మెరుపులు మెరిపించారు.

IPL 2024 SRH vs RR Kavya Maran s winning celebration

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ధీటుగా ఆడింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడినప్పటికీ ఆ తరువాత కుదురుకుంది. దాదాపుగా గెలిచింత పని చేసింది. ఒకదశలో 201 పరుగుల భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించేలా కనిపించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్- 67, టాప్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్- 77 పరుగులతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు గానీ.. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలం అయ్యారు.

మిడిల్ ఓవర్లల్లో ఒత్తిడికి లోనైంది రాజస్థాన్ రాయల్స్. వరుసగా వికెట్లను కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయ్యాక రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయిర్, ధృవ్ జురెల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో పావెల్ అవుట్ కావడంతో 200 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్‌కు తెర పడింది.

ఈ మ్యాచ్ గెలవడం పట్ల కావ్యా మారన్ కంటే హ్యాపియెస్ట్ పర్సన్ మరొకరు ఉండరేమో. చిట్టచివరి బంతి వరకూ ఎంత టెన్షన్‌గా పడ్డారామె స్టాండ్స్‌లో. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ను అనుభవించారు. మ్యాచ్ చేతి నుంచి జారిపోయిందనే ఆందోళన ఆమెలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక దశలో మ్యాచ్ చూడలేనన్నట్టు ముఖాన్ని చేతులతో దాచుకున్నారు.

IPL 2024 SRH vs RR Kavya Maran s winning celebration

లో ఫుల్‌టాస్‌గా భువనేశ్వర్ కుమార్ సంధించిన ఇన్నింగ్ చివరి బంతి బుల్లెట్ వేగంతో ఆఫ్, లెగ్ స్టంప్స్ మీదికి దూసుకుని రావడం, దాన్ని ఆడటంలో రౌమెన్ పావెల్ విఫలం కావడం, అది కాస్తా ప్యాడ్స్‌ను బలంగా తాకడం చకచకా సాగిపోయాయి.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్ అప్పీల్ చేయడం, అంపైర్ గాల్లోకి వేలు లేపడం సెకెండ్ల వ్యవధిలో జరిగిపోయింది. అనూహ్యంగా మ్యాచ్ గెలవడంతో కావ్యా మారన్ ఆనందాన్ని పట్టపగ్గాల్లేవు. అంపైర్ అవుట్ ఇవ్వగానే చిందులేసింది.

Story first published: Friday, May 3, 2024, 10:05 [IST]
Other articles published on May 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+