Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్ట్.. అలా కుదిరిందంతే: భువి

SRH vs RR: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్‌ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాట్‌తో, అనంతరం బంతితో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. బలమైన రాజస్థాన్ రాయల్స్‌ను చిట్టచివరి బంతిలో

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి చెలరేగాడీ మ్యాచ్‌లో. 42 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్- 42, ఓపెనర్ ట్రావిస్ హెడ్- 58 పరుగులతో మెరుపులు మెరిపించారు.

IPL 2024 SRH vs RR I was not thinking about the result in the last over says Bhuvaneshwar Kumar

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ధీటుగా ఆడింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడినప్పటికీ ఆ తరువాత కుదురుకుంది. దాదాపుగా గెలిచింత పని చేసింది. ఒకదశలో 201 పరుగుల భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించేలా కనిపించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్- 67, టాప్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్- 77 పరుగులతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు గానీ.. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలం అయ్యారు.

మిడిల్ ఓవర్లల్లో ఒత్తిడికి లోనైంది రాజస్థాన్ రాయల్స్. వరుసగా వికెట్లను కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయ్యాక రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయిర్, ధృవ్ జురెల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో పావెల్ అవుట్ కావడంతో 200 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్‌కు తెర పడింది.

ఈ మ్యాచ్ మొత్తానికీ మొనగాడిలా నిలిచాడు భువనేశ్వర్ కుమార్. మూడు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో 41 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. ప్రమాదకరమైన జోస్ బట్లర్, సంజు శాంసన్‌ను ప్రారంభ ఓవర్లల్లోనే పెవిలియన్ పంపించాడు. ఇన్నింగ్ చిట్టచివరి బంతికి పావెల్‌ను అవుట్ ఎల్బీడబ్ల్యూగా చేయడంతో విజయం సన్‌రైజర్స్‌ను వరించింది.

IPL 2024 SRH vs RR I was not thinking about the result in the last over says Bhuvaneshwar Kumar

చివరి ఓవర్‌ను సక్సెస్ ఫుల్‌గా ముగించడంపై స్పందించాడు భువనేశ్వర్ కుమార్. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడాడు. ఈ ఓవర్ ఎలా వేయాలనే విషయంపై ఎలాంటి గేమ్ ప్లాన్ లేదని చెప్పాడు. చివరి ఓవర్‌లో రిజల్ట్ గురించి ఆలోచించలేదని పేర్కొన్నాడు. చివరి ఓవర్ వేయడానికి బంతిని అందుకున్నాక పాట్ కమిన్స్ తన దగ్గరకు వచ్చి ఫలితం ఎలా ఉన్నా ఫర్వాలేదంటూ ధైర్యం చెప్పాడని అన్నాడు.

మ్యాచ్‌ను చివరి బంతి వరకూ తీసుకెళ్లాలని భావించానని, దానికి అనుగుణంగా బంతులను వేశానని అన్నాడు. చివర్లో ఒక ఎక్స్‌ట్రా ఫీల్డర్‌ను మోహరింపజేస్తే బాగుంటుందని అనుకున్నానని, ఆ అవసరం రాలేదని చెప్పాడు. ఈ పిచ్‌పై బంతి ఇంతగా స్వింగ్ అవుతుందని అనుకోలేదని, బంతి స్వింగ్ అయినప్పుడే వికెట్లు తీయడానికి అవకాశం లభిస్తుందని చెప్పాడు.

Story first published: Friday, May 3, 2024, 9:14 [IST]
Other articles published on May 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+