For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భువికి బదులుగా ఆ చివరి ఓవర్ నేను వేయాలనుకున్నా

SRH vs RR: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్‌ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాట్‌తో, అనంతరం బంతితో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. బలమైన రాజస్థాన్ రాయల్స్‌ను చిట్టచివరి బంతిలో

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి చెలరేగాడీ మ్యాచ్‌లో. 42 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్- 42, ఓపెనర్ ట్రావిస్ హెడ్- 58 పరుగులతో మెరుపులు మెరిపించారు.

IPl 2024 SRH vs RR I was like who gonna bowl the last over says Nitish Kumar Reddy

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ధీటుగా ఆడింది. ప్రారంభ ఓవర్లల్లో తడబడినప్పటికీ ఆ తరువాత కుదురుకుంది. దాదాపుగా గెలిచింత పని చేసింది. ఒకదశలో 201 పరుగుల భారీ స్కోర్‌ను అలవోకగా ఛేదించేలా కనిపించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్- 67, టాప్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్- 77 పరుగులతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు గానీ.. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలం అయ్యారు.

మిడిల్ ఓవర్లల్లో ఒత్తిడికి లోనైంది రాజస్థాన్ రాయల్స్. వరుసగా వికెట్లను కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయ్యాక రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయిర్, ధృవ్ జురెల్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో పావెల్ అవుట్ కావడంతో 200 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్‌కు తెర పడింది.

ఈ మ్యాచ్‌ అనంతరం నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. చివరి ఓవర్‌ను తాను వేయాలనుకున్నానని, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వేయడానికి రావడం చూసి, ఆగిపోయానని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను గెలిపిస్తాడనే నమ్మకం కలిగిందని పేర్కొన్నాడు. ఇలాంటి మ్యాచ్‌లను ఎన్నో ఎదుర్కొన్న అనుభవం అతనికి ఉందని వ్యాఖ్యానించాడు.

IPl 2024 SRH vs RR I was like who gonna bowl the last over says Nitish Kumar Reddy

ఈ మ్యాచ్‌లో తాము గెలుస్తామని అనుకోలేదని, డ్రా కావడమో లేక ఓడిపోవడమో ఖాయమని భావించానని అన్నాడు. చివరి బంతికి వికెట్ పడుతుందని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చాడు. గత రెండు మ్యాచ్‌లల్లో హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తోందని నితీష్ రెడ్డి గుర్తు చేసుకున్నాడు.

ఇన్నింగ్‌ను నిర్మించడం, క్రీజ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బౌలర్‌పై ఎదురుదాడికి దిగాలనేది తన గేమ్ ప్లాన్‌గా వివరించాడు. అదే సమయంలో యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ రావడంతో.. తన పని మరింత సులువైందని పేర్కొన్నాడు. నిజానికి- ఏడాది కాలంగా ఇలాంటి బ్యాటింగ్ అవకాశం కోసం ఎదురు చూస్తో వస్తోన్నానని, ఈ సీజన్‌లో లభించిన ఆ చాన్స్‌ను నిలబెట్టుకుంటోన్నానని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా చేయగల నిజమైన ఆల్ రౌండర్‌గా ఎదగడం తన లక్ష్యమని వివరించాడు.

Story first published: Friday, May 3, 2024, 10:39 [IST]
Other articles published on May 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+