Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం అడ్డు?: ఏ జట్టుకు ఎన్ని పాయింట్లు?

SRH vs LSG: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. తన సమవుజ్జీగా ఉంటోన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది సన్‌రైజర్స్‌కు. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం గెలవక తప్పదు. ఈ మ్యాచ్ గెలిస్తే నాకౌట్స్‌కు మరింత చేరువ అవుతుంది. 14 పాయింట్లతో టోర్నమెంట్‌లో ముందుడుగు వేయగలుగుతుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఆరింట్లో నెగ్గింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

IPL 2024 SRH vs LSG Weather report Will rain play spoiler for today s match in Hyderabad

సన్‌రైజర్స్ కాకుండా మరో మూడు జట్లు- చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాల్లో కూడా 12 పాయింట్లు ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌లో గెలవగలిగితే ఈ మూడు జట్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు, ఈక్వేషన్లు, నెట్ రన్‌రేట్‌ లెక్కలతో సంబంధం లేకుండా తన ప్లేఆఫ్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.

ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. రెండు రోజులుగా హైదరాబాద్‌ను కుమ్మి వదిలేసిన వరుణుడు.. నేడు శాంతించినట్టే కనిపిస్తోంది. ఈ రాత్రి వరకూ హైదరాబాద్‌లో వర్షం పడటానికి అనుకూల వాతావరణం లేదు. ఆకాశం మేఘావృతమై కనిపించినప్పటికీ వర్షం పడకపోవచ్చు.

టాస్ పడిన సమయం అంటే సాయంత్రం 7 గంటల నుంచి వర్షం పడటానికి గల అవకాశాలు 51 శాతం మాత్రమే ఉన్నాయి. 7 గంటల సమయంలో 31 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. గాలిలో తేమ 60 నుంచి 65 శాతం మధ్య ఉండొచ్చు. రాత్రి 8 గంటలకు 51, 9 గంటలకు 50, 10 గంటలకు 38, 11 గంటలకు 32 శాతం వరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Wednesday, May 8, 2024, 13:15 [IST]
Other articles published on May 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+