Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ మ్యాచ్ గెలిస్తేనే రోయ్- సన్‌రైజర్స్‌కు డేంజర్ బెల్స్

SRH vs LSG: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. తన సమవుజ్జీగా ఉంటోన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది సన్‌రైజర్స్‌కు. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం గెలవక తప్పదు. ఈ మ్యాచ్ గెలిస్తే నాకౌట్స్‌కు మరింత చేరువ అవుతుంది. 14 పాయింట్లతో టోర్నమెంట్‌లో ముందుడుగు వేయగలుగుతుంది.

IPL 2024 SRH vs LSG The both teams who have 12 points faceoff today

ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఆరింట్లో నెగ్గింది సన్‌రైజర్స్ టీమ్. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయాన్ని సాధించగలిగితే 14 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకుతుంది. ప్లేఆఫ్స్‌కు దాదాపుగా చేరువ అయినట్టవుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కాకుండా మరో మూడు జట్లు- చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాల్లో కూడా 12 పాయింట్లు ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌లో గెలవగలిగితే ఈ మూడు జట్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు, ఈక్వేషన్లు, నెట్ రన్‌రేట్‌ లెక్కలతో సంబంధం లేకుండా తన ప్లేఆఫ్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది సన్‌రైజర్స్.

పైగా- లక్నో జెయింట్స్‌తో కాకుండా సన్‌రైజర్స్ చేతిలో ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. ఈ రెండు జట్లు కూడా ప్లేఆఫ్స్ నుంచి వైదొలగినట్టే. ఈ రెండూ ప్రస్తుతం డెస్ట్రాయర్స్‌గా మారాయి. లక్నోతో పాటు చివరి రెండింట్లో ఏ ఒక్కటి నెగ్గినా ఊపిరిపీల్చుకునే వెసలుబాటు కలుగుతుంది.

ఈ మ్యాచ్ కీలకం కావడం వల్ల తుదిజట్టు కూర్పుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవచ్చు మేనేజ్‌మెంట్. బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జెన్‌సెన్‌ను తప్పించే అవకాశం ఉంది. అతన్ని కాదనుకుంటే గ్లెన్ ఫిలిప్స్‌కు చోటు కల్పించవచ్చు. జయదేవ్ ఉనద్కత్‌ లేదా ఉమ్రాన్ మలిక్‌లల్లో ఒకరికే చోటు దక్కొచ్చు.

తుదిజట్టులో- అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జెన్‌సెన్ /గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్/జయ్‌దేవ్ ఉనద్కత్ ఆడే అవకాశం ఉంది.

Story first published: Wednesday, May 8, 2024, 9:50 [IST]
Other articles published on May 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+