Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాట్ కమ్మిన్స్‌కు వ్యక్తిగతంగా ప్రిస్టేజియస్..!!

SRH vs LSG: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. తన సమవుజ్జీగా ఉంటోన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది సన్‌రైజర్స్‌కు. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే మాత్రం గెలవక తప్పదు. ఈ మ్యాచ్ గెలిస్తే నాకౌట్స్‌కు మరింత చేరువ అవుతుంది. 14 పాయింట్లతో టోర్నమెంట్‌లో ముందుడుగు వేయగలుగుతుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఆరింట్లో నెగ్గింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

IPL 2024 SRH vs LSG Sunrisers Hyderabad Captain Pat Cummins will play his birthday match today

సన్‌రైజర్స్ కాకుండా మరో మూడు జట్లు- చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఖాతాల్లో కూడా 12 పాయింట్లు ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్‌లో గెలవగలిగితే ఈ మూడు జట్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు, ఈక్వేషన్లు, నెట్ రన్‌రేట్‌ లెక్కలతో సంబంధం లేకుండా తన ప్లేఆఫ్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.

అటు టీమ్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్‌కూ వ్యక్తిగతంగా ఈ మ్యాచ్ ప్రతిష్ఠాత్మకంగా మారింది. నేడు అతని బర్త్‌డే. 31వ పుట్టినరోజును జరుపుకొంటోన్నాడీ ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్. బర్త్‌డే నాడు ఆడే గేమ్ ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు.. అది కూడా ప్లేఆఫ్స్ ముగింట్లో ఉన్న సమయంలో.

గత ఏడాది ఐసీసీ వరల్డ్ కప్ 2023‌ను తన దేశానికి అందించాడు పాట్ కమ్మిన్స్. అంతకుముందు వరల్డ్ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌నూ అతని సారథ్యంలోనే గెలుచుకుంది ఆసీస్. 2023లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డునూ అందుకున్నాడు.

దాని తరువాత అతని కేప్టెన్సీలో జరిగే ది బెస్ట్.. ఐపీఎల్. ఇప్పుడు దీని టైటిల్ వేటలో పడ్డాడు. 20 కోట్ల రూపాయలను అతనిపై ఇన్వెస్ట్ చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్. అదీ ఒకరకంగా కమ్మిన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్ లాంటిదే. ఏ రకంగా చూసినా కమ్మిన్స్‌కు ఇది ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో జట్టును ఎలా విజయ తీరాలకు చేర్చుతాడనేది ఆసక్తికరంగా మారింది.

Story first published: Wednesday, May 8, 2024, 11:55 [IST]
Other articles published on May 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+