Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారం గ్యాప్ తరువాత సన్‌రైజర్స్ తొలి మ్యాచ్: ఫైర్ వర్క్స్ గ్యారంటీడ్

SRH vs GT: ఐపీఎల్ 2024 సీజన్‌‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్ ఆడబోతోంది. తన సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనబోతోంది. ఎందుకు కీలకం అంటే- ఇదొక్కటీ గెలిస్తే ఇతరత్రా ఎలాంటి ఈక్వేషన్లతో పనే లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరొచ్చు. 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికీ ఎగబాకే అవకాశమూ ఉంది.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. వారం రోజుల తరువాత సన్‌రైజర్స్ ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే కావడం ఆసక్తి రేపుతోంది. గత బుధవారం నాడు లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది సన్‌రైజర్స్. లక్నో నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లల్లో వికెట్ నష్టపోకుండా ఊది పడేసింది.

IPL 2024 SRH vs GT Head to Head Weather and Pitch report of Hyderabad s Uppal stadium

మరోసారి అలాంటి ఫైర్ వర్క్స్ ఉండాలనే కోరుకుంటోన్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు. దీనితో పాటు ఇంకో మ్యాచ్ కూడా మిగిలేవున్న నేపథ్యంలో ఈ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ప్లేఆఫ్స్ చేరుకోవడానికి గల అవకాశాల్లో అత్యధికగా 86 శాతం సన్‌రైజర్స్‌కే ఉన్నాయి.

ఇప్పటివరకు ఈ రెండు జట్లు నాలుగుసార్లు తలపడగా.. మూడు మ్యాచ్‌లల్లో గుజరాత్ టైటాన్స్‌దే పైచేయి. ఒక్కసారి మాత్రమే సన్‌రైజర్స్ గెలిచింది. ఈ సీజన్‌లో తొలి రౌండ్‌లో కూడా గుజరాత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది. దీనికి ప్రతీకారం ఎలాగూ బాకీ ఉన్నందున ఇక్కడా చెలరేగి ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే.

ఉప్పల్ స్టేడియం పిచ్.. సహజంగానే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ పిచ్‌పై మొత్తం 76 మ్యాచ్‌లు జరగ్గా.. అత్యధిక విజయాలు నమోదైంది ఛేజింగ్‌లోనే. రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జట్లు 42 మ్యాచ్‌లల్లో విజయం సాధించిందీ పిచ్‌పై. టాస్ గెలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్..తొలుత ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపొచ్చు.

Story first published: Thursday, May 16, 2024, 14:36 [IST]
Other articles published on May 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+