Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్రైజర్స్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

SRH vs CSK: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌ మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బంతితో, అనంతరం బ్యాట్‌తో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. బలమైన సూపర్ కింగ్స్ టీమ్‌ను అలవోకగా ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడీ ఇంపాక్ట్ ప్లేయర్‌. అజింక్య రహానె- 35, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా- 31 పరుగులు చేశారు.

IPL 2024 SRH vs CSK Sunrisers Hyderabad defeated most successful teams CSK and MI

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ టార్గెట్‌ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇంకా 11 బంతులు మిగిలివుండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ సత్తా చాటుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లల్లోనూ అద్బుతంగా రాణిస్తోంది. గత సీజన్‌ ఆటతీరుకు భిన్నంగా జూలు విదిలిస్తోంది. 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంత అధ్వాన్నంగా ఆడిందో చూశాం. 14 మ్యాచ్‌లల్లో గెలిచింది నాలుగు మాత్రమే. పాయింట్ల పట్టికలో 10 స్థానంతో సరిపెట్టుకుంది.

ఇప్పుడు మాత్రం దీనికి పూర్తి భిన్నం. మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లను సైతం మట్టికరిపించింది. గెలిచిన రెండు మ్యాచ్‌లు కూడా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మీదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముంబై ఇండియన్స్‌పై ఏకంగా 277 పరుగులతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన జట్టును 165 పరుగులకే కట్టడి చేయగలిగింది.

తొలుత బ్యాటింగ్ చేస్తే ఎంత వరకు ఆడొచ్చనేది ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరూపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ జట్టు బౌలర్లను ముప్పతిప్పలు పెట్టింది. అదే- తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చినా చెన్నై సూపర్ కింగ్స్ వంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టును 165 పరుగులకే కట్టడం చేయగలిగింది. బౌలింగ్‌ సత్తా చాటుకుంది.

Story first published: Saturday, April 6, 2024, 10:24 [IST]
Other articles published on Apr 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+