Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఐపీఎల్ స్టార్ స్పిన్నర్లను మర్డర్ చేస్తోన్నాడు: నేనే సెలెక్టర్‌గా ఉంటే- లెజెండరీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

MS Dhoni: ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో మట్టికరిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ టార్గెట్‌ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.

ఇంకా 11 బంతులు మిగిలివుండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు- విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది.

IPL 2024 SRH vs CSK Shivam Dube murdering the spinners says Irfan Pathan

ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా నష్టపోయిందేమీ లేదు గానీ తన పాయింట్లను మాత్రం పెంచుకోలేకపోయింది. ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో తొలి రెండింట్లో గెలిచింది. చివరి రెండు మ్యాచ్‌లల్లో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉందా టీమ్.

టీమ్‌లో శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఆఫ్ స్టంప్స్‌కు కాస్త అవతల పాట్ కమ్మిన్స్ వేసిన స్లోయర్ బౌన్సర్‌ను భారీ షాట్ ఆడబోగా బ్యాక్‌వర్డ్ పాయింట్‌ దిశగా గాల్లోకి లేచిన ఆ బంతిని భువనేశ్వర్ కుమార్ తేలిగ్గానే అందుకున్నాడు.

చెన్నై ఓడినప్పటికీ శివం దుబే బ్యాటింగ్ ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో 148 పరుగులు చేశాడు దుబే. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. 160.87 స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ సాగుతోంది. తొలి మ్యాచ్‌లో 34, రెండో మ్యాచ్‌లో 51, మూడో మ్యాచ్‌లో 18 పరుగులు చేశాడు.

IPL 2024 SRH vs CSK Shivam Dube murdering the spinners says Irfan Pathan

శివం దుబే బ్యాటింగ్ ఫామ్‌పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. తాను బీసీసీఐ సెలెక్టర్‌ను అయివుంటే దుబేను ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ 2024కు సెలెక్ట్ చేస్తానని తేల్చి చెప్పాడు. స్పిన్ బౌలింగ్‌ను అతను అద్భుతంగా ఎదుర్కొంటొన్నాడని, ఒకరకంగా చెప్పాలంటే స్పిన్నర్లను మర్డర్ చేస్తోన్నాడని వ్యాఖ్యానించాడు.

గత సీజన్లలోనూ శివం దుబే స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగాడని గుర్తు చేశాడు. అలాంటి బ్యాటర్ ఉన్నప్పుడు, అతన్ని సద్వినియోగం చేసుకోకూడదని ప్రశ్నించాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను కూడా అంతే సామర్థ్యంతో ఎదుర్కొంటోన్నాడని పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో దుబే సమర్థవంతంగా ఆడగలడని కితాబిచ్చాడు.

Story first published: Saturday, April 6, 2024, 13:39 [IST]
Other articles published on Apr 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+