For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాట్ కమ్మిన్స్ గుండెలు అదిరేలా చేస్తోన్న ఐపీఎల్ స్టార్ బ్యాటర్

SRH vs CSK: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌ మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బంతితో, అనంతరం బ్యాట్‌తో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. బలమైన సూపర్ కింగ్స్ టీమ్‌ను అలవోకగా ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడీ ఇంపాక్ట్ ప్లేయర్‌. అజింక్య రహానె- 35, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా- 31 పరుగులు చేశారు.

IPL 2024 SRH vs CSK I would not want to be bowling to Abhishek Sharma says Pat Cummins

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ టార్గెట్‌ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇంకా 11 బంతులు మిగిలివుండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ సత్తా చాటుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లల్లోనూ అద్బుతంగా రాణిస్తోంది. గత సీజన్‌ ఆటతీరుకు భిన్నంగా దుమ్ము దులుపుతోంది. 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంత అధ్వాన్నంగా ఆడిందో చూశాం. 14 మ్యాచ్‌లల్లో గెలిచింది నాలుగు మాత్రమే. పాయింట్ల పట్టికలో 10 స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మాత్రం దీనికి పూర్తి భిన్నం.

ప్రత్యేకించి ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొడుతున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో 32, ముంబై ఇండియన్స్‌పై రెండో మ్యాచ్‌లో 63, గుజరాత్ టైటాన్స్‌పై 29 పరుగులు చేశాడు.

IPL 2024 SRH vs CSK I would not want to be bowling to Abhishek Sharma says Pat Cummins

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌పైనా అదే ఫామ్‌ను కొనసాగించాడు. 12 బంతుల్లోనే 37 పరుగులు పిండుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకున్నాడు అభిషేక్ శర్మ. ఈ నాలుగు మ్యాచ్‌లల్లో 161 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. 217.57 స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ పరుగులు పెడుతోంది.

అతని బ్యాటింగ్ దూకుడుకు వరల్డ్ క్లాస్ బౌలర్ పాట్ కమ్మిన్స్‌ను సైతం గుండెలు అదిరేలా చేస్తోంది. ఇదే విషయాన్ని కమ్మిన్స్ ప్రస్తావించాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ అద్భుతంగా ఉంటోందని ప్రశంసించాడు. అతనికి బౌలింగ్ వేయకూడదని తాను కోరుకుంటోన్నానని నవ్వుతూ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో శివం దుబే బ్యాటింగ్ చేసిన ఆకట్టుకుందని వ్యాఖ్యానించాడు.

Story first published: Saturday, April 6, 2024, 10:48 [IST]
Other articles published on Apr 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+