For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీకి సలహాలు ఇస్తోన్న మాజీలు

MS Dhoni: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఓడిపోవడం హాట్ టాపిక్‌గా మారింది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై. మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలకు తెర తీసింది ఈ ఓటమి. అతను బ్యాటింగ్ వచ్చిన పరిస్థితులు సైతం దీనికి కారణం అయ్యాయి.

శుక్రవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో పరాజయం పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. అజింక్య రహానె- 35, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా- 31 పరుగులు చేశారు.

IPL 2024 SRH vs CSK Dhoni should have batted up the order says Irfan Pathan

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ టార్గెట్‌ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇంకా 11 బంతులు మిగిలివుండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది.

ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో ధోని బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. 20వ ఓవర్ మూడో బంతికి డారిల్ మిఛెల్ అవుటైన తరువాత ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడు. రెండు బంతులను ఎదుర్కొని, ఒక్క పరుగే చేయగలిగాడు. నాటౌట్‌గా నిలిచాడు. చివరి మూడు బంతులు మిగిలి ఉన్న సమయంలో అతను బ్యాటింగ్‌‌కు రావడం చర్చనీయాంశమైంది.

IPL 2024 SRH vs CSK Dhoni should have batted up the order says Irfan Pathan

దీనిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీ ఇంకా ముందుకు వచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. గతంలో ఢిల్లీ కేపిటల్స్‌పై అనుసరించిన వ్యూహాన్ని అతను గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ 16 బంతుల్లో 37 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు.

సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉనద్కత్.. పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటూ హాఫ్ కట్టర్‌లతో చెలరేగుతున్న సమయంలో ధోనీ కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే బాగుండేదని, వారి బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని ఉండేవాడని వ్యాఖ్యానించాడు. అంతకుముందు ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ మైఖెల్ వాన్, న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ సైమన్ డౌల్ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Story first published: Saturday, April 6, 2024, 12:35 [IST]
Other articles published on Apr 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+