For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ బ్యాటింగ్‌.. సీఎస్‌కేకు శాపమా? అక్కడ ఉంటేనే సేఫ్?

SRH vs CSK: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌ మట్టికరిపించిది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియంలో తొలుత బంతితో, అనంతరం బ్యాట్‌తో చెలరేగింది. ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది. బలమైన సూపర్ కింగ్స్ టీమ్‌ను అలవోకగా ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివం దుబే టాప్ స్కోరర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడీ ఇంపాక్ట్ ప్లేయర్‌. అజింక్య రహానె- 35, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా- 31 పరుగులు చేశారు.

IPL 2024 SRH vs CSK Chennai Super Kings losses 2 games when Dhoni bat wins 2 when he didn t bat

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ టార్గెట్‌ను ఛేదించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఇంకా 11 బంతులు మిగిలివుండగానే 166 పరుగులు చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ విజయంతో తన పాయింట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకోగలిగింది.

ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా నష్టపోయిందేమీ లేదు గానీ తన పాయింట్లను మాత్రం పెంచుకోలేకపోయింది. ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో తొలి రెండింట్లో గెలిచింది. చివరి రెండు మ్యాచ్‌లల్లో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉందా టీమ్.

చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన తొలి రెండు విజయాలు, మలి రెండు అపజయాలకు ఓ తేడా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో ఆ జట్టు మాజీ కేప్టెన్, వికెట్‌ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కు దిగలేదు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగులను టాప్ ఆర్డర్ బ్యాటర్లే కొట్టేశారు.

గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసినప్పటికీ.. ధోనీ బ్యాటింగ్‌కు దిగాల్సిన అవసరం రాలేదు. ఇక్కడా టాప్ ఆర్డర్ బ్యాటర్లే మొత్తం 20 ఓవర్లనూ ఆడేశారు. 206 పరుగుల టార్గెట్ పెట్టారు. ఈ రెండింటినీ అలవోకగా గెలుచుకోగలిగింది చెన్నై సూపర్ కింగ్స్.

ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్‌లల్లోనూ ధోనీ బ్యాటింగ్‌కు దిగాడు. ఢిల్లీ కేపిటల్స్‌పై తనదైనశైలిలో మెరుపులు మెరిపించాడు. 16 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 37 పరుగులతో జట్టును ఒడ్డెక్కించే ప్రయత్నిం చేశాడు గానీ అది సాధ్యపడలేదు. ఢిల్లీపై 20 పరుగుల తేడాతో ఓడింది చెన్నై.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ధోనీ చివరి ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చాడు. 19.3లో డారిల్ మిఛెల్ అవుటైన తరువాత ధోనీ బ్యాటింగ్‌కు దిగాడు. రెండు బంతులను ఎదుర్కొని, ఒక్క పరుగే చేయగలిగాడు. ధోనీ బ్యాటింగ్‌ చేసిన రెండింట్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Story first published: Saturday, April 6, 2024, 9:27 [IST]
Other articles published on Apr 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+