Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య ఎవరిది పైచేయి?

SRH vs CSK: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. తన హోమ్ గ్రౌండ్.. ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది సన్‌రైజర్స్‌కు. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన మూడింట్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. రెండింట్లో ఓడింది. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇందులోనూ ఓడిందంటే మున్ముందు టోర్నమెంట్‌లో ముందడుగు వేయడానికి చెమటోడ్చాల్సి ఉంటుంది.

IPL 2024 SRH vs CSK Chennai Super Kings dominates Sunrisers Hyderabad as 15 victories out of 20

చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి దీనికి భిన్నం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. నాలుగు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ మంచి రన్‌రేట్‌తో నెగ్గగలిగితే తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను ఒక్కసారి చెక్ చేస్తే- కొన్ని ఆశ్చర్యకరమైన రికార్డులు కనిపిస్తాయి. మెజారిటీ మ్యాచ్‌లల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యమే చెలాయించింది . కంప్లీట్ డామినేట్‌గా చేసిందీ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై. మరే ఇతర జట్టుపైనా ఈ స్థాయిలో ఆధిపత్యం లేకపోవడం విశేషమే మరి.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 20 సార్లు తలపడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌లల్లో చెన్నై గెలిచింది. అయిదుసార్లు మాత్రమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయం వరించింది. ఇవ్వాళ్టి మ్యాచ్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యాన్ని సన్‌రైజర్స్ అడ్డుకుంటుందా? లేదా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

Story first published: Friday, April 5, 2024, 13:07 [IST]
Other articles published on Apr 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+