ఐపీఎల్-2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. చరిత్ర సృష్టించడం సర్వసాధారణం అన్నట్లుగా చెలరేగుతోంది. 277, 287 రికార్డు పరుగులు సాధించి ప్రత్యర్థి జట్లకు ప్రమాదకర హెచ్చరికలు జారీచేస్తోంది. టైటిల్‌యే లక్ష్యంగా విజయాలతో SRH దూసుకెళ్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో టాప్-4లో నిలిచింది.
హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. బలాబలాలు పరంగా ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే ఫేవరేట్‌గా ఉంది. కానీ సొంతమైదానంలో ఢిల్లీ జట్టును తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో తిరిగి గెలుపు బాట పట్టింది.

అంతేగాక ఈ సీజన్‌లో ఢిల్లీ తొలిసారి హోమ్ గ్రౌండ్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. జట్టు కూర్పుపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. సీజన్ ఆరంభంలో అలరించి తర్వాత పేవల ప్రదర్శన చేస్తున్న షాబాజ్ అహ్మద్‌ను పక్కనపెట్టాలని భావిస్తోంది. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఎడమచేతి బ్యాటర్లకు షాబాజ్ కంటే సుందర్ మెరుగ్గా బౌలింగ్ చేయగలడనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోనుంది.
హిస్టరీలో హోరాహోరీ
ఇప్పటివరకు హైదరాబాద్, ఢిల్లీ 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. కాగా, ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఎస్‌ఆర్‌హెచ్ 12 సార్లు, ఢిల్లీ 11 సార్లు విజయం సాధించాయి. అయితే గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌పై ఢిల్లీదే పైచేయి. 2022లో జరిగిన ఒక్క మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌యే నెగ్గగా, గత సీజన్‌లో చెరో మ్యాచ్ గెలిచాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: మయాంక్ మార్కండే.