Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH Playing XI: ఆ భారత కుర్రాడిపై వేటు.. గుజరాత్‌తో ఆడే తుదిజట్టు ఇదే

SRH Playing 11: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. 12 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఏడింట్లో గెలిచి 14 పాయింట్లు సాధించింది. రేపటి మ్యాచ్‌లో గుజరాత్‌పై నెగ్గితే 16 పాయింట్లకు చేరుకుంటుంది.

ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (19), రాజస్థాన్ రాయల్స్ (16) మినహా మరే జట్టు 16 పాయింట్లను అందుకోలేదు. అందుకే గుజరాత్‌పై గెలిస్తే నెట్ రన్ రేటుతో సంబంధం లేకుండా సన్‌రైజర్స్ తదుపరి దశకు సునాయాసంగా చేరుకుంటుంది. అయితే రేపటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి.

IPL 2024 SRH Playing 11 vs Gujarat Titans Aiden Markram likely to replace Sanvir Singh

ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశను విజయంతో ముగించాలని రేపు కసిగా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక ఓడితే తమకు జరిగే నష్టం కూడా లేకపోవడంతో ఆటగాళ్లంతా స్వేచ్ఛగా ఆడతారు. ఈ స్థితిలో ప్రత్యర్థి జట్టును సన్‌రైజర్స్ తేలికగా తీసుకుంటే గట్టి షాక్‌ ఎదురయ్యే అవకాశాలూ ఉన్నాయి. అందుకే తమ జట్టులోని బలహీనతలపై ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టిసారించింది.

ఈ సీజన్‌లో హైదరాబాద్ గెలుపోటములకు ప్రధాన కారణం ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. వీరద్దరు చెలరేగితే జట్టుకు తిరుగుండదు. కానీ త్వరగా ఔటైతే జట్టుకు ఎదురుదెబ్బే. అంతేగాక అతి దూకుడు కూడా సన్‌రైజర్స్‌ను చాలా మ్యాచ్‌ల్లో దెబ్బతీసింది. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పలేక చతికలబడింది. ఇప్పుడు అదే తరహా ప్రదర్శన కొనసాగితే ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రభావం పడుతుంది. అందుకే అనుభవజ్ఞుడు మార్క్‌రమ్‌ను తిరిగి తుదిజట్టులో తీసుకురావాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.

IPL 2024 SRH Playing 11 vs Gujarat Titans Aiden Markram likely to replace Sanvir Singh

మార్క్‌రమ్ నిలకడగా ఇన్నింగ్స్ నిర్మించగలడు. అంతేగాక అవసరాన్ని బట్టి గేర్ మారుస్తూ దూకుడుగా పరుగులు చేయగలడు. దీంతో మార్క్‌రమ్‌ను రేపటి మ్యాచ్‌లో బరిలోకి దించాలని జట్టు యాజమన్యం ఆలోచిస్తోంది. అయితే మార్క్‌రమ్ కోసం భారత కుర్రాడు సన్వీర్ సింగ్‌‌పై వేటు వేయాలని భావిస్తోంది. ఈ సీజన్‌‌లో సన్వీర్‌కు రెండు అవకాశాలు మాత్రమే ఇచ్చారు. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ముంబై‌పై అజేయంగా 8 పరుగులు చేశాడు. సన్వీర్ బంతితోనూ రాణించగలడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా)
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయ్‌కాంత్, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్: జయదేవ్ ఉనద్కత్.

Story first published: Wednesday, May 15, 2024, 15:53 [IST]
Other articles published on May 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+