Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: సెల్యూట్ సన్‌రైజర్స్.. గర్వపడేలా, చరిత్రలో నిలిచేలా పోరాడారు!

టోర్నీ ఆద్యంతం విజయాలతో హోరెత్తించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిమెట్టుపై బోల్తా పడింది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది. కానీ ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేసిన పోరాటం అద్వితీయం. క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా, ప్రత్యర్థులు సలామ్ కొట్టేలా విధ్వంసం నెలకొల్పారు. రికార్డులను బ్రేక్ చేస్తూ చరిత్రను తిరగరాస్తూ పోరాడారు.

ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది. హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటే ఏకపక్షమే అని, ప్రత్యర్థికి సులువుగా రెండు పాయింట్లు వస్తాయనే రీతిలో గత సీజన్‌లో దారుణమైన విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలతో రగిలిపోయిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ జట్టును సరికొత్తగా నిర్మించాలనుకుంది. విదేశీ ఆటగాళ్ల కోసం రూ.కోట్లు కుమ్మరించింది. కమిన్స్ కోసం ఏకంగా రూ.20.45 కోట్లు ఖర్చు పెట్టింది.

IPL 2024 Salute Sunrisers Hyderabad A Proud and Historic Fight

అయితే వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ తీసుకున్న ఈ నిర్ణయాలను నెటిజన్లతో సహా మాజీ క్రికెటర్లు వెక్కిరించారు. పేలవమైన వ్యూహాలన్నారు. కానీ కట్ చేస్తే.. 2024లో సన్‌రైజర్స్ ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించింది. కనీసం 120 స్కోరు అయినా సాధిస్తారా అని హేళన చేసిన వాళ్లకు బ్యాటుతోనే సమాధానమిచ్చింది. పవర్‌ప్లేలోనే ఏకంగా 125 స్కోరు సాధించి రికార్డులు సృష్టించింది. ఇక 11 ఏళ్లుగా ఎవరూ తాకని ఆర్సీబీ అత్యధిక స్కోరు రికార్డును తునాతునకలు చేసింది.

ఏకంగా మూడు సార్లు 250+ స్కోరు సాధించింది. 287/3, 277/3, 266/7 స్కోర్లు నమోదు చేసింది. టీ20 క్రికెట్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. పొట్టిఫార్మాట్‌లో బ్యాటింగ్ ఎలా చేయాలో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక 15, 16 బంతుల్లో అర్ధశతకాలు..39 బంతుల్లో శతకం మన బ్యాటర్ల సత్తాకు మరో నిదర్శనం. కానీ ఫైనల్‌‌లో తడబడి కప్‌ను చేజార్చుకుంది. ఒక్క రోజు పేలవమైన ఆటతో ట్రోఫీని కోల్పోయింది. అయితే ఈ ఓటమి సన్‌రైజర్స్ కీర్తిని ఇసుకురేణువంత కూడా తగ్గించదు.

ఈ మాటను ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్, ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ‌ ఫ్రాంచైజీలే చెప్పడం విశేషం. ''ఈ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. తలెత్తుకునేలా పోరాడారు. మీరు అందించిన వినోదాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు'' అని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఉద్దేశిస్తూ ఆర్సీబీ ట్వీట్ చేసింది.

'టీ20ల్లో పరుగుల విధ్వంసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఫలితం మరోలా వచ్చింది. కానీ తలెత్తుకునేలా మీరు పోరాడారు' - రాజస్థాన్ రాయల్స్

'సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎంతో గౌరవం ఉంది. ఓ బ్యాడ్ గేమ్ మీ అసాధారణ ఆటను ఏ మాత్రం తగ్గించదు. మరుపురాని క్షణాలను అందించారు. ఆరెంజ్ ఆర్మీకి ఇదో టాప్ సీజన్'- కేకేఆర్

Story first published: Monday, May 27, 2024, 9:50 [IST]
Other articles published on May 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+