For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని ఫామ్ మీదే బెంగ పెట్టుకున్న ఆర్సీబీ

Glenn Maxwell: ఐపీఎల్ 2024 సీజన్‌ 17వ ఎడిషన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తన అయిదో మ్యాచ్ ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మ్యాచ్ మొదలవుతుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లో ఈ జట్టు గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. మూడింట్లో ఓడింది. ప్రస్తుతం ఈ జట్లు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇందులోనూ ఓడిందంటే పరువు పోగొట్టుకుంటుంది ఆర్సీబీ.

IPl 2024 RR vs RCB Royal Challengers Bengaluru hopes on Glenn Maxwell

రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. టోర్నమెంట్‌లో జైత్రయాత్ర సాగిస్తోందా జట్టు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లనూ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ నెగ్గితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ ఫామ్‌లో లేకపోవటం రాయల్ ఛాలెంజర్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో అతను చేసింది 48 పరుగులే. ఈ నాలుగు మ్యాచ్‌లల్లో కూడా రెండు డకౌట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు మ్యాక్స్‌వెల్.

పంజాబ్ కింగ్స్‌తో సొంత గ్రౌండ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయాడు. అయిదు బంతులను ఎదుర్కొని మూడు పరుగులు చేసి హర్‌ప్రీత బ్రార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోల్‌కత నైట్ రైడర్స్‌‌పై ఫర్వాలేదనిపించుకున్నాడు. 28 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్ గాడిన పడిందనుకునే లోపే లక్నో సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో మళ్లీ సున్నాకే వెనుదిరిగాడు.

మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్ కొద్దిసేపైనా క్రీజ్‌లో నిల్చోగలిగితే గెలుపోటములు తారుమారు కావొచ్చు. బౌలర్లను ఎదుర్కొనడంలో వెనకాముందు చూడకుండా ఆడే మ్యాడ్‌ మ్యాక్సీ మళ్లీ ఫామ్‌లోకి రావాలని టీమ్ కోరుకుంటోంది. అది ఎంత వరకు వాస్తవ రూపం దాల్చుతుందనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

Story first published: Saturday, April 6, 2024, 15:31 [IST]
Other articles published on Apr 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+