Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడికి ఛాన్స్ ఇవ్వలేదు.. ఇంపాక్ట్ ప్లేయర్‌ మాత్రమే- సంజు శాంసన్

ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో మ్యాచ్‌లో జైపుర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.

2022 ఫైనల్లో ఓటమిపాలై ట్రోఫీని సాధించే సువర్ణావకాశాన్ని రాజస్థాన్ చేజార్చుకుంది. 2008 తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు మరో టైటిల్‌ను సాధించని విషయం తెలిసిందే. మరోవైపు లక్నో గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరి ఆకట్టుకున్నా నాకౌట్ మ్యాచ్‌ల్లో తడబడింది. ఈ సీజన్‌లో అయినా కప్ కలను సాధించాలని లక్నో సూపర్ జెయింట్స్ ఉవ్విళూరుతోంది.

Rajasthan Royals won the toss and elected to bat

కాగా, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్‌ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముగ్గురు విదేశీ ప్లేయర్లనే తీసుకుంటున్నామని తెలిపాడు. పావెల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే తీసుకున్నామని చెప్పాడు. వేలంలో పావెల్‌ను రూ.7.40 కోట్లకు రాజస్థాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): రాహుల్ , డికాక్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ , రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రియాన్ పరాగ్, శుభమ్ దూబె, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, నవదీప్ సైని,టామ్ కోహ్లర్-కాడ్మోర్, ప్రసిద్ధ్ కృష్ణ, తనుష్ కోటియన్, నాంద్రే బర్గర్, కుల్దీప్ సేన్, డోనోవన్ ఫెరీరా, అబిద్ ముస్తాక్, కునాల్ సింగ్ రాథోర్

లక్నో సూపర్ జెయింట్స్: దేవదత్ పడిక్కల్, క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, KL రాహుల్ , నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీనుల్ హక్, శివమ్ మావి, అమిత్ మిశ్రా, షామర్ జోసెఫ్, డేవిడ్ విల్లీ, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, కృష్ణప్ప గౌతమ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ఆయుష్ బడోని, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, మయాంక్ యాదవ్, అర్షిన్ కులకర్ణి

Story first published: Sunday, March 24, 2024, 15:20 [IST]
Other articles published on Mar 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+