For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా ఓటమికి కారణం అదే.. ఎంతో బాధాకరం- KL రాహుల్

జైపుర్ వేదికగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. సంజు శాంసన్ (82*; 52 బంతుల్లో) సూపర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ పరాగ్ (43; 29 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. యశస్వీ జైస్వాల్ (24; 12 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (20*; 12 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు.

అనంతరం ఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (64*; 41 బంతుల్లో), కేఎల్ రాహుల్ (58; 44 బంతుల్లో) పోరాడారు. 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును దీపక్ హుడా (26; 13 బంతుల్లో), పూరన్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. కానీ కీలక దశలో లక్నో వికెట్లు కోల్పోయి పరాజయాన్ని చవిచూసింది.

IPL 2024 RR vs LSG Missing a season was really painful- KL Rahul

మ్యాచ్ ముగిసిన అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమికి గల కారణాలు వివరించాడు. చిన్నచిన్న పొరపాట్లు చేశామని, ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోవడం ప్రతికూలంగా మారిందని రాహుల్ పేర్కొన్నాడు. కోచ్ లాంగర్ జట్టులో ప్రశాంతతను తీసుకువచ్చాడని కొనియాడాడు. గత సీజన్‌లో తాను మిస్ అవ్వడాన్ని ప్రస్తావిస్తూ ఎంతో బాధాకరం అని తెలిపాడు.

''భారీ టార్గెట్ అని అనుకోవట్లేదు. దాన్ని ఛేజింగ్ చేయవచ్చు. అయితే తొలి పది ఓవర్ల ఆట మాపై ప్రభావం చూపించింది. ఇక మా బౌలర్లు సరైన ప్రదేశాల్లో బంతులు సంధించారు. పేలవంగా ఏమీ బౌలింగ్ చేయలేదు. కొన్ని పొరపాట్లు జరిగాయి. తొలి సీజన్‌లో మొహ్సిన్ మా పవర్‌ప్లే బౌలర్. కానీ గత సీజన్‌లో ఫిట్‌నెస్ లేక అందుబాటులో లేకపోయాడు. అతడు తిరిగి రావడం సంతోషంగా ఉంది. నవీనుల్ మా జట్టులో కీలక ఆటగాడు''

''అయితే పవర్‌ప్లే ప్రతి జట్టుకూ ముఖ్యమైనది. కానీ ఇప్పటివరకు ఎవరికి కోరుకున్న ఫలితాలు పవర్‌ప్లేలో సాధించలేదు. ఇక ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయాం. అయినప్పటికీ మా బ్యాటింగ్ లైనప్‌తో 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేలా ప్రయత్నించాం. విజయం సాధించడానికి మేం మరిన్ని మార్గాలు అన్వేషించాలి. పరుగులు సాధించినప్పుడు మంచి అనుభూతిని పొందుతుంటాం. కానీ అంతింమంగా గెలవాలి. అదే సంతృప్తిని అసలైన ఇస్తుంది. గత సీజన్‌లో ఆటకు దూరమవ్వడంతో ఎంతో బాధాపడ్డాను'' అని కేఎల్ రాహుల్ అన్నాడు.

Story first published: Sunday, March 24, 2024, 20:13 [IST]
Other articles published on Mar 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+