For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నామరూపాల్లేకుండా పోయిన కోహ్లీ రికార్డు

RR vs GT: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు పరాజయాన్ని చవి చూసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మట్టకరిచింది. ఈ సీజన్‌లో ఈ జట్టుకు ఇదే తొలి ఓటమి. సొంతగడ్డపై 196 పరుగుల భారీ స్కోర్ సాధించినా దాన్ని కాపాడుకోలేకపోయింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, కేప్టెన్ సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. 38 బంతుల్లో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో సంజు శాంసన్ 68, 48 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో రియాన్ పరాగ్ 76 పరుగులు చేశారు.

IPL 2024 RR vs GT Shubman Gill surpasses Virat Kohli to become the youngest player

చివరి ఓవర్‌లో షిమ్రాన్ హెట్మెయిర్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. అయిదు బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లల్లో 199 పరుగులతో విజయఢంకా మోగించింది. ఈ క్రమంలో ఏడు వికెట్లను కోల్పోయింది.

తొలి వికెట్ భాగస్వామ్యానికి శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఏకంగా 64 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి శుభారంభం చేసినప్పటికీ.. టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడం వల్ల గుజరాత్ టైటాన్స్ ఓ దశలో ఓటమి కోరల్లో చిక్కుకున్నట్టు కనిపించింది. చివర్లో రషీద్ ఖాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 11 బంతుల్లో నాలుగు బుల్లెట్ల వంటి ఫోర్లతో 24 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో గిల్ 44 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 72 పరుగులు చేశాడు. ఓ సరికొత్త రికార్డునూ నెలకొల్పాడు. ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో చిన్న వయస్సులో 3,000 పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇదివరకు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. దాన్ని తుత్తునీయలు చేశాడు గిల్.

ఐపీఎల్‌లో 3,000 పరుగుల మైలురాయిని అందుకునే సమయానికి గిల్ వయస్సు 24 సంవత్సరాల 215 రోజులు. గతంలో 26 సంత్సరాల 186 రోజుల వయస్సు ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 3,000 పరుగులను పూర్తి చేశాడు. అదే సమయంలో అతి వేగంగా 3,000 పరుగులు చేసిన ప్లేయర్‌గా కూడా నిలిచాడు గిల్. 94 ఇన్నింగుల్లో అతను మూడు వేల పరుగులు చేశాడు.

డేవిడ్ వార్నర్ కూడా సరిగ్గా 94 ఇన్నింగుల్లో ఇన్నేసి రన్స్ బాదాడు. సునామీ వేగంతో ఐపీఎల్‌లో 3,000 పరుగులను చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు క్రిస్ గేల్. ఈ రన్స్ చేయడానికి 75 ఇన్నింగులను మాత్రమే ఆడాడు గేల్. కేఎల్ రాహుల్- 80, జోస్ బట్లర్- 85 ఇన్నింగుల్లో ఈ పరుగులు కొట్టారు.

Story first published: Thursday, April 11, 2024, 10:16 [IST]
Other articles published on Apr 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+