For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దాదా మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్

Rocky Ponting and Sourag Ganguly: ఐపీఎల్ 2024 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. థ్రిల్లర్స్‌ను తలపిస్తోన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను సాధించింది. నాలుగు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

సీఎస్‌కే తరహాలోనే రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటుతోంది. ఆడిన రెండింట్లోనూ గెలుపు బావుటా ఎగురవేసింది. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది సంజు శాంసన్ టీమ్. గురువారం రాత్రి జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను 12 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో రాణించిందీ జట్టు.

IPL 2024 RR vs DC Watch Ricky Ponting and Sourav Ganguly lose cool at umpire

తన హోమ్ గ్రౌండ్స్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గులాబీ జెండా ఎగిరింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్.. 84 పరుగులతో దుమ్ము లేపాడు. 45 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో చెలరేగాడు.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్ ఈ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 173 పరుగుల వద్దే నిలిచిందా జట్టు ప్రస్థానం. ఢిల్లీ కేపిటల్స్‌కు వరుసగా రెండో ఓటమి ఇది. తొలి గేమ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. ప్రత్యర్థి టీమ్ మారినా దాని ఫేట్ మాత్రం ఛేంజ్ కాలేదు.

ఛేజింగ్‌ మొదట్లోనే ఢిల్లీ కేపిటల్స్ క్యాంప్ వేడెక్కింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్, డైరెక్టర్ సౌరవ్ గంగూలీ.. ఫోర్త్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగడం కనిపించింది. అతనితో వాగ్వివాదానికి దిగారు. కొన్ని నిమిషాల పాటు ఈ వాదులాట కొనసాగింది. చివరికి ఫొర్త్ అంపైర్ వారిని కన్విన్స్ చేయగలిగాడు.

దీనికి కారణం లేకపోలేదు. ఇన్నింగ్ తొలి ఓవర్ రెండో బంతికే రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను పిలిపించుకున్నాడు. షిమ్రాన్ హెట్మెయిర్‌కు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బర్గర్‌ను జట్టులోకి తీసుకుంది రాజస్థాన్. ఇన్నింగ్ ఆరంభమైన వెంటనే బర్గర్‌ను డగౌట్‌కు పంపించి.. అతనికి సబ్‌స్టిట్యూట్‌గా రౌమెన్ పావెల్‌ను తీసుకున్నాడు.

దీనిపై రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అయిదుమంది ఓవర్సీస్ ప్లేయర్లను వినియోగించిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఫోర్త్ అంపైర్ వివరణ ఇచ్చారు. తుదిజట్టులోకి ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకున్నారని, బర్గర్‌కు పావెల్ సబ్‌స్టిట్యూట్ మాత్రమేనని వివరించారు.

Story first published: Friday, March 29, 2024, 11:06 [IST]
Other articles published on Mar 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+