Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs DC: ఆఖరి ఓవర్‌లో 4, 6, 6, 6, 4, 6 (Video)

వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 234 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో 84 పరుగులు సాధించింది. అయితే 18వ ఓవర్‌లో క్రీజులోకి అడుగుపెట్టిన షెఫార్డ్ విధ్వంసం సృష్టించాడు. 10 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేశాడు.

నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో షెఫార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాదాడు. తొలి బంతిని వికెట్‌కు నేరుగా బౌండరీ బాదిన ఈ బీస్ట్ తర్వాత హ్యాట్రిక్ సిక్సర్లు సాధించాడు. లాంగ్ ఆన్, డీప్ స్క్వేర్, స్వీపర్ కవర్ మీదుగా బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. అయిదో బంతిని బౌండరీ బాదిన షెఫార్డ్ ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో 20వ ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు వచ్చాయి.

IPL 2024 Romario Shepherd s Blockbuster Finish at Wankhede in MI vs DC Match

షెఫార్డ్‌తో పాటు టిమ్ డేవిడ్ (45*; 21 బంతుల్లో) కూడా చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ముంబై 235 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో, 6x4, 3x6), ఇషాన్ కిషన్ (42; 23 బంతుల్లో, 4x4, 2x6) సత్తాచాటారు. హార్దిక్ పాండ్య (39; 33 బంతుల్లో, 3x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. రోహిత్, ఇషాన్ తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలో 80 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆది నుంచే వీరిద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ముంబై పవర్‌ప్లేలో ఏకంగా 75 పరుగులు సాధించింది.

కానీ ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పుంజుకుని ముంబై స్కోరును కట్టడిచేశారు. 7 ఓవర్లకు 80/0తో ఉన్న ముంబై 12.4 ఓవర్లకు 121/4తో నిలిచింది. కానీ టిమ్ డేవిడ్‌‌ బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఆఖర్లో డేవిడ్‌కు షెఫార్డ్ జతకావడంతో ముంబై భారీ స్కోరు సాధించింది. నోకియా నాలుగు ఓవర్లలో 65 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

Story first published: Sunday, April 7, 2024, 17:57 [IST]
Other articles published on Apr 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+