Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శిష్యుడు వచ్చేస్తున్నాడు.. డేంజర్‌లో హార్దిక్‌‌ కెప్టెన్ పదవి!

ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రపంచ నంబర్‌వన్ టీ20 బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్‌కు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లీగ్‌లో సూర్య ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడని వెల్లడించింది. దీంతో సూర్య మంబై ఇండియన్స్ జట్టుతో శుక్రవారం చేరనున్నాడు.

స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సూర్య గతేడాది ఆఖర్లో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. కాగా, ఫిబ్రవరి నుంచి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టిసారించిన సూర్యకుమార్ ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్నాడు. అయితే ఐపీఎల్ ప్రారంభంలోనే సూర్యకు ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. కానీ అప్పుడు సూర్య ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు.

IPL 2024 Rohit s disciple Suryakumar is coming Hardik s captaincy is in danger

కాగా, ఇప్పుడు సూర్య రాకతో ముంబై ఇండియన్స్‌లో నయా జోష్ రానుంది. ప్రమాదకర బ్యాటర్ సూర్య ఒంటి చేత్తో ముంబైకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే అతని గైర్హాజరీలో ముంబై ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. మరోవైపు తిరిగి ముంబై గూటికి చేరి జట్టు బాధ్యతలు అందుకున్న హార్దిక్‌కు ఈ వరుస ఓటములు పెద్ద తలనొప్పిగా మారాయి.

సహచర ఆటగాళ్ల నుంచి ఆశించిన రీతిలో మద్దతు లభించకపోవడం, రోహిత్ అభిమానుల నుంచి బయట వ్యతిరేకత ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నహార్దిక్.. విజయం కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ రాక అందరి కంటే హార్దిక్‌నే ఎక్కువ సంతోషపెడుతుంది. కానీ రోహిత్-హార్దిక్ కెప్టెన్సీ వివాదం కొనసాగుతున్న ఈ స్థితిలో సూర్య ఎవరికి మద్దతుగా నిలుస్తాడనే ప్రశ్న అందరిలో మొదలైంది.

IPL 2024 Rohit s disciple Suryakumar is coming Hardik s captaincy is in danger

రోహిత్‌కు ఎంతో నమ్మకమైన శిష్యుడు సూర్యకుమార్ యాదవ్. రోహిత్‌ను కాదని హార్దిక్‌ను కెప్టెన్‌‌గా ప్రకటించిన రోజే సూర్య ముంబై ఫ్రాంచైజీపై వ్యతిరేకత చూపించాడు. హార్ట్ బ్రేక్ సింబల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హిట్‌మ్యాన్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు హార్దిక్-రోహిత్ అంటూ జట్టులో రెండు వర్గాలుగా చీలిపోయాయి. మరి ఈ తరుణంలో సూర్య ఎంట్రీ హార్దిక్‌కు పాజిటివా? నెగిటివా? అనే చర్చ మొదలైంది.

మ్యాచ్ విన్నర్ సూర్య జట్టులోకి వస్తే ఓ కొత్త కెప్టెన్‌‌గా అది హార్దిక్‌కు కచ్చితంగా మంచిదే. కానీ రోహిత్‌కు అత్యంత సన్నిహితుడు అయిన సూర్య వల్ల హార్దిక్ కెప్టెన్సీకే ఎఫెక్ట్ పడే అవకాశమూ ఉంది. కీలక ఆటగాడు బుమ్రా ఇప్పటికే రోహిత్ వైపు నిలిచాడు. తొలి మ్యాచ్‌లో ఆ విషయం స్పష్టంగా తెలిసింది. మరి, భవిష్యత్‌లో సూర్య కూడా రోహిత్‌కే జై కొడితే హార్దిక్ కెప్టెన్సీకి గ్యారెంటీ ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

Story first published: Thursday, April 4, 2024, 15:46 [IST]
Other articles published on Apr 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+