Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్‌లు (Video)

మరో మూడు రోజుల్లో ఐపీఎల్ మొదలు కానుంది. మార్చి 22న ప్రారంభంకానున్న ఐపీఎల్ 17వ సీజన్‌కు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లందరూ కఠోర సాధన చేస్తూ చెమట చిందిస్తున్నారు. కాస్త ఆలస్యంగా ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. డిఫెన్స్, పుల్ షాట్లతో హిట్ మ్యాన్ అలరించాడు.

హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ స్టార్ చేసిన వెంటనే హార్దిక్ పాండ్య ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చాడు. హార్దిక్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు రోహిత్ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. హద్దులు దాటి.. 'RIP హార్దిక్ పాండ్య' అంటూ ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌ను ట్రోల్ చేస్తున్నారు. వేలల్లో పోస్ట్‌లు ప్రత్యక్షమవ్వడంతో రిప్ హార్దిక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌‌లోకి వచ్చింది. కాసేపటికే ట్విటర్ ట్రెండింగ్‌లో నుంచి ఆ పదాన్ని తొలగించింది.

IPL 2024 Rohit Sharma started practice fans posts on Twitter saying RIP Hardik Pandya

అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించడంతో ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా రోహిత్, హార్దిక్ అభిమానులు మినీ వార్ చేస్తున్నారు. అభిమానుల భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటున్నానని ఇటీవల హార్దిక్ పేర్కొన్నప్పటికీ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వదిలిపెట్టట్లేదు.

అయితే రోహిత్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేసినందుకే ఇలా చేస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, మార్క్ బౌచర్ పాల్గొన్నారు. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు హార్దిక్ బదులిచ్చాడు.

నాకు సాయం చేసేందుకు రోహిత్ శర్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని, రోహిత్ కెప్టెన్సీ లెగసీని ముందుకు తీసుకెళ్తానని తెలిపాడు. నా భుజాలపై చేతులేసి రోహిత్ జట్టును నడిపిస్తాడని హార్దిక్ హిట్‌మ్యాన్ అభిమానులకు నచ్చజెప్పాడు. కానీ రోహిత్ గురించి అడిగిన మరికొన్ని ప్రశ్నలకు హార్దిక్, బౌచర్ సైలెంట్‌గా ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రోహిత్ ఫ్యాన్స్ తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, మార్చి 24 ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

Story first published: Tuesday, March 19, 2024, 13:42 [IST]
Other articles published on Mar 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+