For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL: రోహిత్ కోసం ముస్తాఫిజుర్‌ను కొట్టిన ధోనీ (Video)

సమ్మర్ హీట్ కంటే ఐపీఎల్ హీట్‌యే ఎక్కువైంది. లీగ్ ప్రారంభమై ఒక్క రోజే గడించింది. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఐపీఎల్ కబుర్లే. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గురించి నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.

అయితే చెపాక్‌లో ఆర్సీబీపై సీఎస్‌కే ఆధిపత్యం చెలాయించడం మామూలే. సీఎస్‌కే కంచుకోటలో 2008 నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. చరిత్ర కొనసాగింపుగా శుక్రవారం మరోసారి రాయల్ ఛాలెంజర్స్ ఓటమి పాలైంది. కానీ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ మార్పు, విరాట్ కోహ్లి రీఎంట్రీ, ముస్తాఫిజుర్ ఎల్లో ఎంట్రీ‌ వంటి విశేషాలు మ్యాచ్‌లో ఉన్నాయి.

IPL 20224 Rivals became friends Dhoni Mustafizur Collision Video Goes Viral

ఇటీవల బంగ్లాదేశ్-శ్రీలంక సిరీస్‌లో కండరాలు పట్టేయడంతో స్ట్రెచర్‌పై ముస్తాఫిజుర్ మైదానాన్ని వీడాడు. కానీ కోలుకుని వెంటనే చెన్నైకి బయలుదేరాడు. తుదిజట్టులో చోటు దక్కించుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు వికెట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ధోనీ టీమ్‌లో ముస్తాఫిజుర్ గొప్ప ప్రదర్శన చేసిన ఈ నేపథ్యంలో ఓ పాత వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ధోనీ దెబ్బకి ముస్తాఫిజుర్‌ నేలకతికాడు.

2015లో భారత్-బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఆ పోరులో ప్రజలు ధోనీ కోపాన్ని చూశారు. ముస్తాఫిజుర్ చేసిన పనికి కూల్‌‌గా ఉండే ధోనీకి ఆవేశం వచ్చింది. రోహిత్ కోసం ముస్తాఫిజుర్‌ను నెట్టేశాడు. దెబ్బకి అతడు నొప్పితో విలవిలలాడాడు. అసలేం జరిగిందంటే.. రోహిత్ పరుగు కోసం ప్రయత్నిస్తుండగా ఉద్దేశపూర్వకంగా ముస్తాఫిజుర్ అడ్డు వచ్చాడు. రోహిత్ పరుగుకు ఆటంకం కలిగించాడు. రోహిత్ ఔటయ్యే ప్రమాదంలో పడ్డాడు. కానీ బంగ్లా ఫీల్డర్లు త్రో వేయడంలో విఫలమయ్యారు.

దీంతో ముస్తాఫిజుర్‌పై హిట్ మ్యాన్ సీరియస్ అడ్డాడు. ఇదంతా ధోనీ గమనించాడు. కాసేపటికీ ధోనీ సింగిల్ కోసం ట్రై చేసినప్పుడు కూడా ముస్తాఫిజుర్ కావాలనే అడ్డువచ్చాడు. రోహిత్‌లా ధోనీ పక్కకు తప్పుకుని పరుగు పూర్తిచేయలేదు. ముస్తాఫిజుర్‌ను ముందే గమనించి తన భుజంతో ఓ తోపు తోసి పరుగు పూర్తిచేశాడు. ఈ ఘటనపై ఐసీసీ మ్యాచ్ ఫీజులో ధోనీకి 75%, ముస్తాఫిజుర్‌కు 50% జరిమానా విధించింది. ఆ తర్వాత మ్యాచ్‌ నుంచి టీమిండియా బ్యాటర్లకు ముస్తాఫిజుర్ రెండు అడుగుల దూరంలో ఉండటం గమనార్హం. కాగా, ఐపీఎల్ పుణ్యమా అప్పటి శత్రువులు.. ఇప్పుడు మిత్రులుగా మారారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, March 23, 2024, 12:26 [IST]
Other articles published on Mar 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+