Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు

ఐపీఎల్-2024 సీజన్ దాదాపు అర్ధభాగం ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ సీఎస్కే జట్టులో చేరాడు. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ డెవాన్ కాన్వే ఈ సీజన్‌కు పూర్తిగా దూరమవ్వడంతో, అతని స్థానంలో రిచర్డ్ వచ్చాడు. రిచర్డ్‌ను రిజర్వ్ ప్రైజ్ రూ.50 లక్షలకు చెన్నై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.

''గాయం కారణంగా డెవాన్ కాన్వే ఐపీఎల్-2024 సీజన్‌కు దూరమయ్యాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కాన్వే 23 మ్యాచ్‌ల్లో 924 పరుగులు చేశాడు. తొమ్మిది హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 92 నాటౌట్. కాగా, ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు రిచర్డ్ గ్లీసన్‌ను సీఎస్కే తీసుకుంది''

IPL 2024 Richard Gleeson is the new player in CSK Rohit and Kohli tormentor

''ఇంగ్లండ్ తరఫున రిచర్డ్ గ్లీసన్ ఆరు టీ20లు ఆడాడు. తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడిన గ్లీసన్ 101 వికెట్లు తీశాడు. కనీస ధర రూ.50 లక్షలతో అతడు సీఎస్కే జట్టులో చేరాడు'' అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా, 36 ఏళ్ల రిచర్డ్ గ్లీసన్ రెండేళ్ల క్రితం అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున లేటు వయసులో అరంగేట్రం చేసిన మూడో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 34 ఏళ్ల 219 రోజుల వయసులో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌‌తో తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లోనే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ వికెట్లు తీసి అందరి దృష్టి ఆకర్షించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోనీ, అరవెల్లి అవనీష్, రిచర్డ్ గ్లీసన్, అజింక్యా రహానె , షేక్ రషీద్, మొయిన్ అలీ , శివమ్ దూబే , RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా , అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరనా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, తీక్షణ, సమీర్ రిజ్వీ.

Story first published: Thursday, April 18, 2024, 14:54 [IST]
Other articles published on Apr 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+