Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌‌‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్‌ఫుల్ టీమ్. కానీ ఒక్కసారి కూడా కప్ అందుకోలేదు. గత 16 సీజన్లలో ఎనిమిది సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. దానిలో మూడు సార్లు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మిగిలిన సీజన్లలో గ్రూప్ దశకే పరిమితమైంది. ప్రస్తుత 17వ సీజన్‌లో టైటిల్‌ను అందుకోవాలని కసిగా బరిలోకి దిగింది. కానీ పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచింది.

ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది. మిగిలిన్నింట్లో ఓటమిపాలైంది. పాయింట్ల పరంగానే కాకుండా నెట్ రన్‌ రేట్‌లోనూ ఆర్సీబీది బ్యాంక్ బెంచే. ఈ స్థితిలో ఉన్న బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుందా అంటే ఎవరైనా అసాధ్యమే అని అంటారు. కానీ ఆ జట్టుకు నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా తదుపరి దశకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక మూడో స్థానంతోనూ గ్రూప్ స్టేజ్‌‌ను ముగించివచ్చు. టైటిల్ కలను ఈ సీజన్‌లోనే నెరవేర్చుకునే ఛాన్స్‌లూ ఉన్నాయి.

IPL 2024 RCB s Playoff Prospects Promising and Within Reach

ఈ సీజన్‌లో గ్రూప్ స్టేజ్‌లో ఆర్సీబీ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాలి. వాటన్నింట్లో గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. అలా సాధిస్తే నెట్‌రన్ రేటుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు. అయితే అప్పుడు టాప్-2 లేదా టాప్-3 జట్లపై ఆర్సీబీ ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మిగిలిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే ఆర్సీబీకి ఎంతో కలిసొస్తుంది.

రాజస్థాన్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాలి. వాటిలో ఆర్‌ఆర్ నాలుగింట్లో గెలవాలి. అలాగే కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ తమ మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదింట్లో విజయం సాధించాలి. అప్పుడు ఆర్‌ఆర్ 22 పాయింట్లు, కోల్‌కతా, హైదరాబాద్ చెరో 20 పాయింట్లతో టాప్-3లో ఉంటాయి. అలాంటి స్థితిలో ఆర్సీబీ 14 పాయింట్లు సాధిస్తే.. మిగిలిన జట్లు 12 పాయింట్లు కంటే ఎక్కువ సాధించలేవు. ఎందుకంటే ఈ నాలుగు జట్లు గెలిస్తే.. మిగిలిన జట్లు ఓడిపోవాల్సిందే కదా.

ఆర్సీబీ మూడో స్థానానికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలా జరగాలంటే కేకేఆర్, సన్‌రైజర్స్ ఫామ్ కోల్పోవాలి. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు కేవలం ఒక్క విజయమే సాధించాలి. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆరు మ్యాచ్‌ల్లో అయిదు గెలవాలి. అప్పుడు రాజస్థాన్‌తో లక్నో టాప్-2కి వెళ్తుంది. ఆర్సీబీ 14 పాయింట్లు సాధిస్తే.. మిగిలిన జట్లు అన్నీ 12 పాయింట్లతో ముగిస్తాయి. ఆర్సీబీ 12 పాయింట్లతో కూడా ప్లేఆఫ్స్‌కు వెళ్లొచ్చు. కానీ అది మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆర్సీబీ అభిమానులు 'ఈ సాలా కప్ నమదే' అనే నినాదాన్ని ఇంకా కొనసాగించవచ్చు.

Story first published: Thursday, April 25, 2024, 9:54 [IST]
Other articles published on Apr 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+