For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బ్యాడ్ లక్..!!

Glenn Maxwell: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఓడింది. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడింది. స్కోర్ బోర్డ్ మీద జమ చేసిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆర్సీబీకి ఇది వరుసగా నాలుగో ఓటమి.

గురువారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. దాన్ని అలవోకగా కొట్టిపడేశారు ముంబై బ్యాటర్లు.

IPL 2024 RCB vs SRH Glenn Maxwell to miss next match due to thumb injury

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఇంత భారీ స్కోర్ చేయడానికి ప్రధాన కారకులు కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పటిదార్, వికెట్‌కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్. ఈ ముగ్గురూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీళ్లు తప్ప మరెవరూ కూడా కనీసం రెండంకెల వ్యక్తిగత స్కోర్ కూడా చేయలేపపోయారు.. చివరికి విరాట్ కోహ్లీ కూడా.

దీనితో మరో ఓటమి ఆర్సీబీ ఖాతాలో పడింది. ఆరు మ్యాచ్‌లల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోనే గెలిచింది. రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దాని స్థానం.. 9. ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 15వ తేదీన ఆడబోతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టబోతోంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక.

ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ దూరం కానున్నాడు. అతని బొటనవేలికి గాయం కావడమే దీనికి కారణం. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అందుకే తన నాలుగు ఓవర్ల కోటాను కూడా ముగించలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో అతను వేసింది ఒక్క ఓవరే. 17 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ సీజన్‌లో ఏ మాత్రం ఫామ్‌లోని ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తదుపరి మ్యాచ్‌కు దూరం కావడం ఒకరకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బ్యాడ్‌లక్‌గానే చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్‌లో, ఇటు ఫీల్డింగ్‌లో రాణించలేని ఓ ప్లేయర్ జట్టులో ఉంటే ప్రత్యర్థికి కలిసి వచ్చినట్టే అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లను ఆడాడు మ్యాక్స్‌వెల్. 32 పరుగుల మాత్రమే చేయగలిగాడు. బ్యాటింగ్ యావరేజ్ అయిదు పరుగులు. ఇందులో అత్యధికం 28. ఈ ఆరు మ్యాచ్‌లల్లో అతను చేసిన స్కోర్.. 0,3,28,0,1,0. ఇదో ఎవరూ కోరుకోని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Story first published: Friday, April 12, 2024, 13:14 [IST]
Other articles published on Apr 12, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+