For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్‌కు గుడ్ న్యూస్

Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మరో మెమొరబుల్ మ్యాచ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చిరస్మరణీయమైన మ్యాచ్ ఆడింది. అదే రేంజ్‌లో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో తన రికార్డులను తానే తిరగరాసుకుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో ఘన విజయాలను సాధించింది. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

సోమవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని 25 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ తోడు కావడంతో చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ కనిపించింది.

IPL 2024 RCB vs SRH Pat Cummins named as the Wisden s best cricketer of 2023

అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆర్సీబీ అద్భుతంగా పోరాడింది. ప్రారంభ, చివరి ఓవర్లల్లో విజృంభించి ఆడారు బ్యాటర్లు. మిడిలార్డర్ విఫలం కావడం, మిడిల్ ఓవర్లల్లో భారీ భాగస్వామ్యం ఏర్పడకపోవడం వారి పరాజయానికి దారి తీసింది. లోయర్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తోన్న దినేష్ కార్తీక్ 35 బంతుల్లో ఏడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 83 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు కేప్టెన్ పాట్ కమ్మిన్స్‌కు అరుదైన గౌరవం లభించింది. విస్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023గా నిలిచాడు కమ్మిన్స్. తన జాతీయ జట్టు ఆస్ట్రేలియాకు ఐసీసీ వరల్డ్ కప్‌ను అందించడం దీనికి ప్రధాన కారణం. ఆ ఏడాది మొత్తం పాట్ కమ్మిన్స్ 42 టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు. ఓ మ్యాచ్‌లో 10 వికెట్లను పడగొట్టాడు.

2012 తరువాత ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌కు విస్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించడం ఇదే తొలిసారి. అప్పట్లో మైఖెల్ క్లార్క్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 2023లో జట్టును అద్భుతంగా డ్రైవ్ చేయగలిగాడని, అందుకే ఈ అవార్డుకు పాట్ కమ్మిన్స్ పేరును ఎంపిక చేసినట్లు విస్డన్ ఎడిటర్ లారెన్స్ బూథ్ తెలిపారు.

Story first published: Tuesday, April 16, 2024, 10:30 [IST]
Other articles published on Apr 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+