Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాయల్ ఛాలెంజర్స్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్

Glenn Maxwell: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో చిరస్మరణీయమైన మ్యాచ్ ఆడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో తిరుగులేని విజయాన్ని అందుకుంది. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. ఐపీఎల్ ఒక్కటే కాదు.. మొత్తం టీ20 మ్యాచ్‌ల చరిత్రలోనే తనకంటూ ఓ పేజీని సృష్టించుకోగలిగింది.

సోమవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని 25 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో నాలుగింట్లో ఘన విజయాలను సాధించింది. చివరి మూడు మ్యాచ్‌లల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

IPL 2024 RCB vs SRH Glenn Maxwell takes a break from IPL 2024

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ తోడు కావడంతో చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ కనిపించింది.అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆర్సీబీ అద్భుతంగా పోరాడింది.

ప్రారంభ, చివరి ఓవర్లల్లో విజృంభించి ఆడారు బ్యాటర్లు. మిడిలార్డర్ విఫలం కావడం, మిడిల్ ఓవర్లల్లో భారీ భాగస్వామ్యం ఏర్పడకపోవడం వారి పరాజయానికి దారి తీసింది. లోయర్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తోన్న దినేష్ కార్తీక్ 35 బంతుల్లో ఏడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 83 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆడని విషయం తెలిసిందే. తుదిజట్టులో అతనికి చోటు దక్కలేదు. ఈ గేమ్‌కు అతను దూరం అయ్యాడు. స్వచ్ఛందంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకొన్నాడు. తుదిజట్టును ఎంపిక చేయడానికి కొద్దిసేపటి ముందు ఈ విషయాన్ని కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు తెలియజేశాడు. తనకు బదులుగా మరొకరిని ప్లేయింగ్ 11కు సెలెక్ట్ చేయాలని కోరాడు.

ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా వెల్లడించాడు. ఈ సీజన్‌లో తాను ఆశించిన స్థాయిలో ఆడట్లేదని, కొంత విరామం కావాలని మేనేజ్‌మెంట్‌ను కోరానని వివరించాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో జట్టు అంచనాలు, గేమ్ ప్లాన్‌కు అనుగుణంగా ఆడలేకపోయానని అంగీకరించాడు.

మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నానని, ఐపీఎల్ సీజన్ నుంచి బ్రేక్ తీసుకోవాలని భావిస్తోన్నానని తెలిపాడు. శారీరకంగా, మానసికంగా విరామం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తోన్నానని పేర్కొన్నాడు. తనను ప్లేయింగ్ 11లో తీసుకోకపోవడానికి కారణాలను వెదుక్కోనక్కర్లేదని వ్యాఖ్యానించాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లను ఆడాడు మ్యాక్స్‌వెల్. 32 పరుగుల మాత్రమే చేయగలిగాడు. బ్యాటింగ్ యావరేజ్ అయిదు పరుగులు. ఇందులో అత్యధికం 28. ఈ ఆరు మ్యాచ్‌లల్లో అతను చేసిన స్కోర్.. 0,3,28,0,1,0. ఎవరూ కోరుకోని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

Story first published: Tuesday, April 16, 2024, 11:41 [IST]
Other articles published on Apr 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+