Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs LSG: వాళ్లను తప్పిస్తేనే ఆర్సీబీకి విజయం- మాజీ క్రికెటర్

ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. అయితే హోమ్ గ్రౌండ్‌లో జరిగిన గత మ్యాచ్‌లో కేకేఆర్‌ చేతిలో ఆర్సీబీ ఓటమిపాలైంది. దీంతో బెంగళూరు జట్టు కూర్పుపై విమర్శలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆర్సీబీ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌ను జట్టు నుంచి తప్పించాలని సూచించాడు. వాళ్ల స్థానంలో లాకీ ఫెర్గూసన్, టోప్లేను జట్టులోకి తీసుకురావాలని అన్నాడు. బ్యాటింగ్‌లో బెంగళూరు మెరుగ్గానే ఉందని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.

IPL 2024 RCB vs LSG Stuart Broad s Prediction RCB s Victory Hinges on Green and Joseph s Absence

''ఆర్సీబీపై ఒక్కొక్కరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. గొప్ప బ్యాటర్లు కలిగిన చరిత్ర ఆ ఫ్రాంచైజీకి ఉంది. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ప్రాతినిథ్యం వహించారు. విరాట్ కోహ్లి ఇప్పటికీ జట్టులో ఉన్నాడు. నా దృష్టిలో ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటింగ్ మెరుగ్గానే ఉంది. విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మంచి లయతో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో తానుండాలనే కసితో పరుగులు సాధిస్తున్నాడు. ఇక కోహ్లితో పాటు జట్టులో డుప్లెసిస్, మాక్స్‌వెల్ ఉన్నారు. కాబట్టి బ్యాటింగ్ గురించి సమస్య లేదు''

''అయితే ఆర్సీబీ ఇద్దరు విదేశీ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలనుకుంటున్నాను. బెంగళూరు జట్టులో బౌలింగ్ స్ట్రాంగ్‌గా లేదు. బౌలింగ్‌తో విజయాలు సాధించాలను వాళ్లు భావించట్లేదు. కానీ టోప్లీ, ఫెర్గూసన్ జట్టులోకి రావాలి. ఎడమచేతి వాటంతో స్వింగ్ బౌలింగ్ చేసే పేసర్, ఉత్తమ ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉండటం మంచింది. డుప్లెసిస్, విరాట్, మాక్స్‌వెల్ పరుగులు సాధిస్తారు. కానీ దాన్ని కాపాడుకుని విజయం సాధించాలంటే ఎటాకింగ్ బౌలింగ్ కూడా ఉండాలి. అధిక ధర వెచ్చించి ట్రేడ్ చేసుకున్న గ్రీన్‌ను పక్కనపెట్టడం కష్టతరమే. కానీ జట్టు సమతూకం కోసం చేయాలి'' అని బ్రాడ్ పేర్కొన్నాడు.

ట్రేడ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ నుంచి కామెరూన్ గ్రీన్‌ను ఆర్సీబీ రూ.17.5 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ కోసం వేలంలో రూ.11.50 కోట్లు వెచ్చించింది.

ఆర్సీబీ జట్టు: డుప్లెసిస్, కోహ్లి, గ్రీన్ ,రజత్ పటిదార్, మాక్స్ వెల్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, మహిపాల్ లోమ్రర్, సుయాష్ ప్రభుదేసాయి, కర్ణ్ శర్ , విజయ్ కుమార్ వైశాక్, స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, విల్ జాక్స్, మనోజ్ భాందగే, ఆకాశ్ దీప్, సౌరవ్ చౌహాన్, రాజన్ కుమార్ , హిమాన్షు శర్మ, టోప్లే, టామ్ కరన్.

Story first published: Tuesday, April 2, 2024, 14:04 [IST]
Other articles published on Apr 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+