Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్ పోయినా ఆ విషయంలో కోహ్లీ మాత్రం యమ హ్యాపీ

Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో రెండు ఓడిపోయిన మ్యాచ్‌లే ఉన్నాయి. తన సొంత గడ్డపై 182 పరుగుల భారీ స్కోర్‌ను చేసినా గానీ దాన్ని కాపాడుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో మట్టికరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్- 8, రజత్ పటిదార్- 3, అనూజ్ రావత్- 3 విఫలం అయ్యారు. కామెరాన్ గ్రీన్- 33, మ్యాక్స్‌వెల్- 28 ఫర్వాలేదనిపించారు.

IPL 2024 RCB vs KKR Virat Kohli has equaled Suresh Raina s record of 109 catches

ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ విరాట్ కోహ్లీ ఒక్కడే క్రీజ్‌లో నిలవగలిగాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో క్రీజ్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్ తనకు అలవాటైన రీతిలో భారీ షాట్లు బాదడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది ఆర్సీబీ. ఎనిమిది బంతులను ఎదుర్కొన్న డీకే మూడు సిక్సర్లతో 20 పరుగులు చేశాడు.

ఇంత భారీ స్కోర్‌ను ఇంకా 19 బంతులు మిగిలివుండగానే కొట్టి అవతలపడేసింది కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్. ఈ క్రమంలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్- 30, సునీల్ నరైన్: 47, వెంకటేష్ అయ్యర్- 50 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్- 47, రింకూ సింగ్- 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అటు ఫీల్డర్‌గా కూడా రాణించాడు. గ్రౌండ్‌లో చిరుతలా కదిలాడు. కొన్ని బౌండరీలను ఆపాడు. మెరుపు క్యాచ్‌నూ అందుకున్నాడు. 30 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో 50 పరుగులు చేసి.. టాప్ గేర్‌లో దూసుకెళ్తోన్న వెంకటేష్ అయ్యర్‌ను పెవిలియన్ దారి పట్టించాడు.

ఆఫ్ స్టంప్‌కు కాస్త దూరంగా యాష్ దయాళ్ సంధించిన ఇన్నింగ్ 16వ ఓవర్ తొలి బంతిని భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన బంతిని కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇది అతని 109వ క్యాచ్. దీనితో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా రికార్డును సమం చేశాడు.

Story first published: Saturday, March 30, 2024, 9:17 [IST]
Other articles published on Mar 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+