Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం యాక్టింగ్ చేస్తున్నార్రా నాయనా: గవాస్కర్ ఎకసెక్కాలు

Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఆడిన మూడింట్లో రెండు ఓడిపోయిన మ్యాచ్‌లల్లో ఓడిపోయింది. తన సొంత గడ్డపై 182 పరుగుల భారీ స్కోర్‌ను చేసినా కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దిగజారింది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో మట్టికరిచింది ఆర్సీబీ. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఇంకా 19 బంతులు మిగిలివుండగానే కేకేఆర్ దాన్ని కొట్టి అవతలపడేసింది.

IPL 2024 RCB vs KKR Sunil Gavaskar reacts on Virat Kohli and Gautam Gambhir hug

ఫాఫ్ డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటిదార్, అనూజ్ రావత్.. వంటి టాప్ క్లాస్ బ్యాటర్లు టీమ్‌లో ఉన్నప్పటికీ- బరువు మాత్రం విరాట్ కోహ్లీనే మోశాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. గ్రీన్, మ్యాక్సీ మినహా మరెవరూ కూడా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. చివర్లో క్రీజ్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్ తనకు అలవాటైన రీతిలో భారీ షాట్లు బాదడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది ఆర్సీబీ.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ- కోల్‌కత నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. ఇన్నాళ్లు ఉప్పు- నిప్పుల్లా ఉంటూ వచ్చారు వీరిద్దరూ. గత సీజన్‌లో వీరిమధ్య చోటు చేసుకున్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఇప్పటికీ మరిచిపోలేదు అభిమానులు.

ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ కంటే కూడా వీరిద్దరూ ఎలా ఎదురు పడతారు? ఎలా రియాక్ట్ అవుతారనేదే హాట్ టాపిక్‌గా మారింది. అలాంటిది- ఒకరినొకరు అభినందించుకున్నారు. హగ్ చేసుకున్నారు. మ్యాచ్‌ స్ట్రాటజిక్ టైమ్‌లో కోహ్లీ దగ్గరికి వచ్చి మరీ అభినందించాడు గంభీర్. అప్పటికే కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దీనిపై సునీల్ గవాస్కర్ రియాక్ట్ అయ్యాడు. కామెంటరీ బాక్స్ నుంచి కోహ్లీ- గంభీర్‌ హగ్‌పై హిలేరియస్‌గా స్పందించాడు. వారికి ఫెయిర్ ప్లే అవార్డ్ ఇచ్చినా చాలదని, ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సిందేనంటూ కామెంట్స్ చేశాడు.

Story first published: Saturday, March 30, 2024, 10:34 [IST]
Other articles published on Mar 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+